ముందు సేనను తరువాత సేనాని ! ఓహో బీజేపీ ప్లాన్ ఇదా ?

ఏపీలో బలపడాలని చూస్తున్న బిజెపి దానికోసం వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తోంది.ఇక్కడ వేగంగా బలపడాలంటే బలమైన పార్టీ కానీ, బలమైన నాయకుడి అవసరం ఎంతయినా ఉంది అనే విషయాన్ని గుర్తించింది.

 Bjp Eye On Janasena Leaders-TeluguStop.com

ఈ క్రమంలో ఆ పార్టీ కన్ను జనసేన మీద పడినట్టుగా తెలుస్తోంది.గతంలో పవన్ బీజేపీతో స్నేహం చేశారు.

ఆ తరువాత బీజేపీ మీదా, ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడుపై తీవ్రమైన విమర్శలు చేశారు.అయితే ఏపీలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటుకే పరిమితం అయిపోయింది.

ఇక పవన్ పార్టీ ఏపీలో కనుమరుగే అని అంతా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా జనసేనకు బలం పెంచే దిశగా పవన్ అడుగులు వేయడం మొదలుపెట్టాడు.కమిటీలు, ప్రజా పోరాటాలు చేస్తూ, వైసీపీ ప్రభుత్వంపై బలమైన విమర్శలకు దిగుతూ ముందుకు వెళ్తున్నాడు.

పవన్ కు మంచి రాజకీయ నాయకుడి లక్షణాలు ఉన్నా పార్టీని నడిపించడంలో మాత్రం తడబడుతున్నట్టు బీజేపీ గుర్తించింది.అందుకే జనసేన పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద బీజేపీ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం జనసేన పార్టీలో పవన్ తరువాత ఆ స్థాయి ఇమేజ్ ఉండి పార్టీని ముందుకు నడిపించే నాయకులు పెద్దగా ఎవరూ లేరు.పవన్ తన పార్టీలో మేధావి వర్గాన్నంతా పెట్టుకున్నావారెవరికీ ప్రజల్లో పెద్దగా గుర్తింపు అయితే లేదు.

అయినా జననసేన పార్టీలో ఉన్న కీలక నాయకులను గుర్తించి వారిని పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.బలం లేని నాయకులను చేర్చుకోవాలని అనుకోవడం వెనుక కూడా బలమైన కారణం బీజేపీ దగ్గర ఉంది.

ముందుగా పార్టీలోని నాయకులు ఒక్కొక్కరిని చేర్చుకుంటూ వెళ్తే ఆ తరువాత పవన్ పై వత్తిడి పెంచి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసేలా పవన్ పై ఒత్తిడి తీసుకురావచ్చని బీజేపీ పెద్దలు ఆలోచనగా తెలుస్తోంది.ఇప్పటికే పార్టీని విలీనం చేయాల్సిందిగా పవన్ తో బీజేపీ అగ్ర నాయకులు రాయబారాలు నడిపారు.

అయితే దానికి పవన్ విముఖత వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.ఏపీలో టీడీపీ బలహీనపడుతున్న నేపథ్యంలో జనసేనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పవన్ భావించడమే దీనికి కారణమట.

Telugu Ap, Bjp Master, Janasena, Pawan Kalyan-Telugu Political News

 

జనసేన పార్టీకి పవన్ చరిష్మా ఉన్నా క్షేత్ర స్థాయిలో మాత్రం చాలా బలహీనంగా ఉంది.దీంతో పవన్ కళ్యాణ్ పార్టీలోని కీలక నాయకులు కూడా రాజకీయ అభద్రతా భావంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు.దీన్నే అవకాశంగా తీసుకుని వారిని పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.పవన్ కళ్యాణ్ ఎన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని ముందుకు వేళ్తాడో చెప్పలేని పరిస్థితి ఉంది.ఎందుకంటే పవన్ రాజకీయం అంతా గాలివాటం లా ఉంటుందనే విమర్శలు కూడా ఉన్నాయి.పవన్ కళ్యాణ్ కు నిలకడ తక్కువనే విషయాన్ని అందరూ గుర్తించేశారు.

ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు గ్రహించబట్టే పవన్ పార్టీని, నాయకులను తమ వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.ప్రస్తుతం వైసీపీ, టీడీపీ పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన ను తీర్చిదిద్దుతున్నట్టుగా కనిపిస్తున్న పవన్ బీజేపీ ట్రాప్ లో పడతారో లేక వ్యూహాత్మకంగా వ్యవహరించి జనసేనను ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube