వికలాంగురాలి పట్ల ఎయిర్ హోస్టెస్ ప్రవర్తన పై నెటిజన్ల ప్రసంశలు

వికలాంగుల పట్ల ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్క లా ఉంటుంది.చాలా మంది వారిని చిన్న చూపు చూస్తూ ఉంటారు.

 Air Hostess Writes Heart Warming Note For Deaf Passenger-TeluguStop.com

అయితే ఒక వికలాంగురాలి పట్ల ఎయిర్ హోస్టెస్ చూపించిన కేర్ ను చూసి పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు.ఈ ఘటన డెల్టా ఎయిర్ లైన్స్ కి చెందిన ఎండీవర్ విమానంలో చోటుచేసుకుంది.

ఆష్లే అనే ఒక యువతి ఎండీవర్ విమానంలో ప్రయాణించింది.అయితే ఆమెకు వినికిడి లోపం ఉందని గమనించిన ఎయిర్ హోస్టెస్ జన్నా ఆష్లే కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశ్యం తో కాగితం మీద విమానంలో ఉన్న సౌకర్యాల గురించి రాసిచ్చింది.

ఆ కాగితం మీద జన్నా హాయ్‌ ఆష్లే.ఈ రోజు నేను ఈ ఫ్లైట్‌ అటెండెంట్‌ని.

నీవు కూర్చున్న సీటు పై భాగంలో అనగా నీ తలపైన రెండు బటన్లు ఉన్నాయి.వాటిలో పసుపుపచ్చది లైట్‌ని కంట్రోల్‌ చేస్తుంది.

నీకు నాతో ఏమైనా అవసరం ఉంటే బూడిదరంగులో పెద్దగా ఉన్న బటన్‌ను ప్రెస్‌ చేస్తే నేను నీ దగ్గరకు వస్తాను.అత్యవసర పరిస్థితులు తలెత్తితే.

నీ వెనకే ఉన్న ఎక్జిట్‌ బటన్‌ను ప్రెస్‌ చేయ్‌.నీకు ఏ సాయం కావాలన్న నన్ను అడుగు.

మొహమాట పడకు’ అంటూ కాగితం మీద రాసిచ్చింది.

  దీన్ని ఆష్లే తల్లి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.అయితే ఈ లెటర్ చూసిన ప్రతి ఒక్క నెటిజన్ కూడా జన్నా చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube