సూపర్ స్టార్ మెడకు చుట్టుకున్న ఏనుగు దంతాల కేసు,పరిస్థితి ఏంటో!

మలయాళ సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్, అటు మలయాళం లోనూ ఇటు తెలుగు,తమిళ భాషల్లో కూడా పలు చిత్రాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.అయితే అలాంటి మోహన్ లాల్ పై కేసు నమోదు చేసి కోర్టు లో హాజరు పరచాలని చూస్తున్నారు అటవీశాఖ అధికారులు.ఏడేళ్ల క్రితం నమోదైన ఈ కేసు ఇప్పుడు హియరింగ్ కు రావడం తో ఈ కేసు సూపర్ స్టార్ మెడకు చుట్టుకొని పరిస్థితి ఏర్పడింది.2012 లో మోహన్ లాల్ ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఎర్నాకులం లోని కోర్టు లో అతనిపై చార్జిషీట్ కూడా దాఖలైంది.ఏనుగు దంతాల విషయంలో మోహన్ లాల్ ప్రధాన నిందితుడు కూడా కావడం దానికి తోడు ఆయన నేరం కూడా ఒప్పుకున్నాడు.

 Kodanad Forest Department Files Charge Sheet Filed Against Mohanlal-TeluguStop.com

ఇక ఇప్పుడు పెరుంబవూరులోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తో పాటు కోదనాడ్ రేం‌లోని మేకప్పల ఫారెస్ట్ స్టేషన్‌లో కూడా ఈ కేస్ నమోదైంది.అయితే తన పై కేస్ నమోదు అయిన తర్వాత ఏనుగు దంతాల కళాఖండాలను ఇంట్లో ఉంచుకునేందుకు తనకు అనుమతి ఉందంటూ కోర్టుకు తెలిపాడు మోహన్ లాల్.

తాను కె కృష్ణన్‌ అయ్యర్‌ అనే వ్యక్తి నుంచి 65 వేల రూపాయలకు వీటిని కొనుగోలు చేశానని మోహన్‌లాల్‌ చెప్పుకొచ్చాడు.దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం ఏనుగు దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు సరైన అనుమతి లేదని తేల్చేయడం తో ఇప్పుడు ఈ కేసు సూపర్ స్టార్ మెడకు చుట్టుకోనుంది.

ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఈయనకు ఎలాంటి అనువైన అనుమతి ఇవ్వలేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో కేస్ మళ్లీ మొదటికి వచ్చేసింది.దాంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3)తో మోహన్‌లాల్‌పై నేరం రుజువు చేయొచ్చని హైకోర్టు తేల్చడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Telugu Forestcharge, Mohanlal-

  కాగా కొన్ని రోజుల కింద భారతీయ వన్య ప్రాణి చట్టంలోని సెక్షన్ 44(6) కింద మోహన్ లాల్‌పై కేస్ నమోదు చేసి ప్రధాన నిందితుడిగా కోర్ట్ తేల్చేసిన విషయం విదితమే.అయితే ఇప్పుడు ఈ ఏనుగు దంతాల కేస్ కూడా ఆయన మెడకు చుట్టుకుంటే పరిస్థితి ఏంటా అని నిర్మాతలు కంగారు పడుతున్నారు.ఇప్పటికే పలు సినిమాలతో బిజీ గా ఉన్న ఈ సూపర్ స్టార్ ఇప్పుడు ఈ కేసు మెడకు చుట్టుకుంటే నిర్మాతల పరిస్థితి ఏంటో అన్నది మాత్రం అర్ధంకావడం లేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube