గ్రేట్‌ : 11 ఏళ్ల వయసులోనే 150 మంది పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించిన బాలుడు

ఎంత ఉన్నా కూడా కొంత దానం చేసే గుణం ఉండాలని పెద్దలు అంటారు.కొందరు కోట్లు సంపాదించిన రూపాయలు దానం చేసేందుకు వెనుకాడుతూ ఉంటారు.

 11 Year Oldboy Anand Krishna Who Teaches 250 Slum Kids Daily-TeluguStop.com

కాని కొందరు మాత్రం రూపాయి సంపాదించినా పావలా అయినా దానం చేయాలని భావిస్తారు.తమకు ఉన్న జ్ఞానం ఎంత అనే విషయాన్ని పట్టించుకోకుండా తన కంటే తక్కువ జ్ఞానం ఉన్న వారిని చైతన్య పర్చాలని, వారికి కొద్దిగా అయినా జ్ఞానం కలిగించాలనే ఉద్దేశ్యంతో 11 ఏళ్ల వయసులో ఆనంద్‌ కృష్ణ మిశ్ర అనే కుర్రాడు చేసిన పనిని అంతా అభినందించాల్సిందే.

అతడు దాదాపు 250 మంది పిల్లలకు దేవుడు అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Boyanand, Anand Krishna, Luknow, School Boy, Telugu-Inspirational Storys

  సాయంత్రం సమయం 5 అవుతోంది.లక్నో శివారు ప్రాంతంలోని ఒక బస్తీలో చిన్న పిల్లలు, కాస్త పెద్ద వారు అంతా 10 సంవత్సరాలు పిల్లలు ఒక చోట చేరి ఉన్నారు.వారు ఎందుకు అక్కడ ఉన్నారనే విషయం తెలిస్తే అవాక్కవుతారు.

వారంతా ట్యూషన్‌ కోసం అక్కడ కూర్చుని శ్రద్దగా వారి సార్‌ కోసం వస్తున్నారు.ట్యూషన్‌ కోసం ఎదురు చూస్తుంటే షాక్‌ ఏముందని అంటారా, అయితే అసలు విషయం ఏంటీ అంటే ఆ సారు వయసు కేవలం 11 ఏళ్లు మాత్రమే.

అవును ఆనంద్‌ కృష్ణ అనే 11 ఏళ్ల బాలుడు ఆ స్లమ్‌ ఏరియా పిల్లలకు ట్యూషన్‌ టీచర్‌.చదువుపై ఆసక్తి ఉన్న పిల్లలకు, చదువు కోలేని పిల్లల కోసం ఆనంద్‌ ఈ పని మొదలు పెట్టాడు.

ఉదయం తన స్కూల్‌కు వెళ్లి, సాయంత్రం నాలుగున్న వరకు ఇంటికి వచ్చేసి, తన హోం వర్క్‌ చేసుకుని 5 గంటల వరకు సైకిల్‌పై ఆ స్లమ్‌ ఏరియాకు వెళ్లి పిల్లలకు బేసిక్స్‌ చెప్పేవాడు.రైమ్స్‌, నెంబర్స్‌, అక్షరాలు, చిన్న చిన్న పదాలు ఇలా వారికి తెలిసేలా తెలియజేసేవాడు.

కొందరు పిల్లలు ఏకంగా ఆనంద్‌ వద్దే 5వ తరగతి పాఠాలు కూడా నేర్చుకున్నారు.తనకు వచ్చిన చదువు అంతా కూడా వారికి చెప్పే వాడు.అలా దాదాపు మూడు సంవత్సరాల్లో 250 మంది స్లమ్‌ పిల్లలకు ఆనంద్‌ విద్యా బుద్దులు నేర్పించాడు.

Telugu Boyanand, Anand Krishna, Luknow, School Boy, Telugu-Inspirational Storys

  స్లమ్‌ పిల్లలు అల్లరి చిల్లరగా ఉంటారు, వారు అస్సలు మాట వినరు అని అంతా అనుకుంటారు.కాని ఆనంద్‌ ను ఒక సర్‌ మాదిరిగా ఆ పిల్లలు ట్రీట్‌ చేయడంతో పాటు, ఆనంద్‌ ఏదైతే చెప్తాడో అది తెల్లారి చెప్పేందుకు చేసి చూసేందుకు ఆ స్లమ్‌ పిల్లలు చాలా కష్టపడే వారు.వీరిని గమనించిన ఒక స్వచ్చంద సంస్థ వారు వీరి కోసం పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ ఇంకా ఇతర స్టేషనరీని ఏర్పాటు చేయడం జరిగింది.

మొత్తానికి ఆనంద్‌ వల్ల అంత మంది పిల్లలు విద్యావంతులు అయ్యారు.ఆ 250 మంది పిల్లల్లో కొందరు మరింత చదివేందుకు స్కూల్‌కు వెళ్తుంటే కొందరు మాత్రం ఆ వచ్చిన జ్ఞానంతో తమ పనిలోనే మునిగి పోయారు.

ప్రస్తుతం ఆనంద్‌ 15 ఏళ్ల కుర్రాడు.ఇప్పుడు కూడా పిల్లల కోసం తన సమయంను కేటాయిస్తూనే ఉన్నాడు.

చదువుకు నోచుకోని పిల్లలు ఎంతో మంది ఉన్నారు.వారికి ఆనంద్‌ లాంటి వారు సాయం చేస్తే ఎంతో బాగుంటుంది.

ప్రతి ఒక్కరు ఆనంద్‌ మాదిరిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఆ పిల్లల్లో ఆనంద్‌ దేవుడు అయ్యాడు.

సాయం చేసిన వాడు, జ్ఞానం పంచిన వాడు దేవుడు అంటారు.అందుకే ఆనంద్‌ వారికి దేవుడు అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube