దొంగా పోలీస్ ఆట...జనానికి ప్రాణసంకటం: ఛేజింగ్‌లపై విధివిధానాలు

అమెరికాలో నేరస్తులను పట్టుకోవడానికి అక్కడి పోలీసులు చేజింగ్‌లు చేస్తుంటారు.హాలీవుడ్ సినిమాలను తలపించే ఈ తరహా విన్యాసాల వల్ల సామాన్య పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 City Of Laredo Is Recognizing The Publics Risk During Speed Chases On The Roads-TeluguStop.com

చేజింగ్ సమయాల్లో పోలీసులతో పాటు ప్రజలు సైతం తీవ్రంగా గాయపడిన, మరణించిన ఉదంతాలు కోకొల్లలు.

Telugu Laredo, Publics, Speed Chases, Telugu Nri Ups-

  ఈ నేపథ్యంలో లారేడో నగరం ఈ సాహస విన్యాసాలపై దృష్టి సారించింది.డిస్ట్రిక్ట్ 5కు చెందిన నెల్లీ విల్మా అనే కౌన్సిల్ మెంబర్ తాను ఛేజింగ్‌ల వల్ల పడిన ఇబ్బందిని తెలిపారు.అంతేకాకుండా ఈ ఘటనల్లో గాయపడిన లేదా మరణించిన ఎంతోమంది బాధితులకు న్యాయ సహాయం అందించానని విల్మా వెల్లడించారు.

Telugu Laredo, Publics, Speed Chases, Telugu Nri Ups-

  లారేడో పోలీస్ శాఖ అధిపతి ట్రావినో మాట్లాడుతూ.ఛేజింగ్ సమయాల్లో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై పది పేజీల పాలసీ గైడ్‌ను రూపొందించామన్నారు.కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా నేరస్తుల ఆచూకీని కనుగొని అరెస్ట్ చేసేందుకు తమకు అధికారం ఉందని ఆయన తెలిపారు.పబ్లిక్ సేఫ్టీ అడ్వైజరీ కమిటీ తన రివ్యూ మీటింగ్‌లో ఈ విధానాలపై జాతీయ, రాష్ట్ర, స్థానిక న్యాయ మండళ్లకు దిశానిర్దేశం చేసిందన్నారు.

రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు, నడిచేటప్పుడు ముందు వెనుక గమనించాలని విల్మా, ట్రావినో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube