చదువుపై కోరికతో 11 ఏళ్ల పాప ఎంత కష్టపడిందో తెలిస్తే కన్నీరు ఆగవు

తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే కొందరు పిల్లలు బలాదూర్‌ తిరుగుతూ బాధ్యతలు పట్టించుకోకుండా ఉంటున్నారు.లక్షలు ఖర్చు చేసినా కూడా పిల్లలు సరిగా చదవడం లేదు అంటూ ఏంతో మంది తల్లిదండ్రులు అంటూ ఉండగా మనం చూస్తూనే ఉంటాం.

 Tribal Orphan Child Sombari Sabar Wants To Great Education For Her Promise-TeluguStop.com

కొందరు పిల్లలకు అస్సలు ఆసక్తి ఉండదు.వారి తల్లిదండ్రులు బలవంతంగా చదివించేందుకు ప్రయత్నించినా కూడా ప్రయోజనం తక్కువే.

కాని జార్ఖండ్‌కు చెందిన సోంబర్‌ సబర్‌ అనే బాలిక చదువు కోసం ఎంత కష్టపడిందో తెలిస్తే కన్నీరు ఆగవు.

Telugu Sombari Sabar, Telugu, Tribalorphan-

  పూర్తి వివరాల్లోకి వెళ్తే.జార్జండ్‌ రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంకు చెందిన సోంబరి సబర్‌ తల్లి చిన్న తనంలోనే చనిపోయింది.దాంతో తండ్రి సంరక్షణలో పెరిగింది.

సోంబరికి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ తండ్రి కూడా మృతి చెందాడు.దాంతో ఆ అమ్మాయి అనాధ అయ్యింది.

అంతకు ముందు వరకు వచ్చిన చుట్టాలు, మిత్రులు ఆ తర్వాత ఎవరు కనిపించలేదు.తల్లి దండ్రి లేకపోవడంతో సోంబరి జీవితం దుర్భరంగా మారింది.

తినడానికి తిండి కూడా కష్టం అయ్యింది.అలాంటి సమయంలో కూడా తండ్రి చనిపోతూ చెప్పిన మాటలను బాగా గుర్తు పెట్టుకుంది.

Telugu Sombari Sabar, Telugu, Tribalorphan-

  ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది కలిగినా చదువు మాత్రం మానేయకు అంటూ సోంబరి వద్ద తండ్రి మాట తీసుకున్నాడు.తన తండ్రికి ఇచ్చిన మాట కోసం చదువుకు ఫుల్‌ స్టాప్‌ పెట్టకుండా కంటిన్యూ చేసింది.అయితే జీవితం సాగేదెలా అంటూ అనుకుంది.అప్పుడే ఆమెకు పని చేసుకుని, తనను తాను బతికించుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.అందుకోసం ఉదయాన్నే లేచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే అడవికి వెళ్లి కట్టెలు తీసుకుని వచ్చేది.ఆ కట్టెలను అమ్మగా వచ్చిన డబ్బులతో తన జీవినం సాగించేంది.

Telugu Sombari Sabar, Telugu, Tribalorphan-

  కట్టెలు అమ్మేసిన తర్వాత ఉదయం 9 గంటలకు స్కూల్‌కు వెళ్లేది.స్కూల్‌కు వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ కట్టెలకు వెళ్లి రాత్రి వరకు ఇంటికి వచ్చేది.ఇంట్లో కనీసం చిన్న లైటు కూడా లేక పోయేది.కట్టెల పోయిపై తినేందుకు వండుకుని, దీపం వెలుగులో రాత్రి పొద్దు పోయే వరకు చదువుకుని మళ్లీ తెల్లారుజామునే కట్టెలకు అడవికి వెళ్లేది.

ఇలా సోంబరి సబర్‌ జీవితం సాగుతూ వచ్చింది.ఆమె కష్టం చూసి అయ్యోం పాపం అనే వారు చాలా మందే ఉండే వారు.కాని ఆమెకు కాసింత సాయం చేద్దాం అనుకున్న వారు మాత్రం లేరు.
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది పడ్డా కూడా నాన్నకు ఇచ్చిన మాట మేరకు చదువుకుంటూనే వచ్చింది.

ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న సోంబరి భవిష్యత్తులో మంచి పొజీషన్‌లోకి వెళ్తాను అంటూ నమ్మకంగా చెబుతోంది.సోంబరి కష్టాలు తెలుసుకున్న ఒక స్వచ్చంద సంస్థ ఆమెను చదివించేందుకు ముందుకు వచ్చింది.

దాంతో ఆమె కష్టాలు తొలగిపోయాయి.ప్రస్తుతం ఆమె దృష్టి పూర్తిగా చదువుపైనే పెట్టింది.

ఇలాంటి పట్టుదల కలిగిన అమ్మాయిలు ఎంత మంది ఉంటారు చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube