తుపాకీ సంస్కృతిని కట్టడి చేయండి..అమెరికా కాంగ్రెస్ కి వినతులు...!!!

అమెరికాలో హెచ్చు మీరుతున్న తుపాకీ సంస్కృతిని కట్టడి చేయకపోతే మరిన్ని దారుణాలు జరిగే అవకాశం ఉందని అమెరికాలోని వ్యాపారవేత్తలు అందరూ అమెరికా కాంగ్రెస్ కి లేఖలు రాస్తున్నారు.ఇప్పటి వరకూ జరిగిన మారణ హోమం చాలు, ఎంతో మంది అమాయక ప్రజలు కేవలం తుపాకీ సంస్కృతి కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికేలా చర్యలు తీసుకోండి అంటూ వినతులు పంపారు.

Telugu American Gun, Biggestcompany, Telugu Nri Ups-

 

దాదాపు 145 కంపెనీలకి చెందిన సిఈవో లు అందరూ కలిసి ఈ విషయంపై పట్టుబట్టినట్టుగా స్థానిక మీడియా కధనం ప్రకారం తెలుస్తోంది.ఆయుధ విక్రయాలపై తనికీలు జరిగే విధంగా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఈ సంస్క్ర్తుతికి స్వస్తి పలకాలని వారు సెనేట్ ని కోరారు.ఈ మేరకు ఎంపీలు అందరికి వినతుల రూపంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu American Gun, Biggestcompany, Telugu Nri Ups-

 

దేశంలో ఉన్న ప్రతీ గ్రామము, పట్టణం తుపాకీ నుంచీ విముక్తి కోరుకుంటోందని.ప్రజలు మీరు తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు, అలాగే స్వచ్చంద సంస్థలు కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా పోరు చేస్తున్నాయంటూ నేతలకి వివరించారు.ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 40 వేలకి పైగా తుపాకీ కాల్పుల ఘటనలు జరిగాయని, దాదాపు 10 వేల మందికి పైగానే మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube