అద్దె పెరుగుదలపై కొరడా: చట్టం తీసుకొచ్చిన కాలిఫోర్నియా

ప్రపంచంలోని ఎన్నో దేశాల వారికి డ్రీమ్ అమెరికా వెళ్లడం.అక్కడ బాగా చదువుకుని, మంచిగా సంపాదించాలని చాలా మంది కలలుకంటూ ఉంటారు.

 New Rental Deal In California Approves Statewide Rent Control To Deal With Hous-TeluguStop.com

ఇలా అమెరికా వెళ్లిన వారికి అక్కడ ఇంటి అద్దెలు చుక్కల్ని చూపిస్తున్నాయి.కొద్దిరోజుల క్రితం ఓ స్టార్టప్ కంపెనీ సిలికాన్ వ్యాలీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి పనిచేసే ఉద్యోగులకు 10 వేల డాలర్లు (సుమారు 6.5 లక్షలు) ఇస్తామంటూ ప్రకటించిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

Telugu Caliniacontrol, Control Deal, Telugu Nri Ups-

  సిలికాన్ వ్యాలీకి బయట ఉండే ఇళ్ల అద్దెలు, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటంతో అక్కడికి వెళ్లి పనిచేయాలని భావిస్తున్నారు.పరిస్థితి నానాటికి దిగజారిపోతుండటంతో ఈ క్రమంలో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.ఏటికేడు పెరిగిపోతున్న అద్దెలను కంట్రోల్ చేసేందుకు బిల్లు ను ఆమోదించింది.
దీని ప్రకారం ఇంటి యజమానులు ఏడాదికి 5% మాత్రమే అద్దెను పెంచడానికి వీలుంది.ఈ ఏడాది మార్చి నెల నుంచి బిల్లు అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో ఇంటి అద్దె నివారణకు చట్టాన్ని తీసుకొచ్చిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube