ఈ పోలీసు సార్‌ దయతో వందల మంది ప్రభుత్వం ఉద్యోగంను కొట్టారు, ఇంతకు ఎవరు ఈయన?

ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలని ప్రతి ఒక్క నిరుద్యోగి కోరుకుంటూ ఉంటాడు.కాని సరైన గైడెన్స్‌ మరియు ప్రోత్సాహం లేక ఎంతో మంది ప్రతిభ ఉన్నా కూడా మరుగున పడి ఉంటారు.

 Free Yedukondalu Sir Free Groups Coaching For Poor Students-TeluguStop.com

కొందరు మట్టిలో ఉన్న మాణిక్యాలను తీసుకు వచ్చి సానపెడితేనే వారు మెరుస్తారు.అలాగే నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు యువకులను ఎస్సై ఏడుకొండలు సారు తీసుకు వచ్చి సాన పెట్టాడు.

వారికి కావాల్సిన గైడెన్స్‌ మరియు ప్రోత్సాహం ఇచ్చాడు.దాంతో ఆయన తీసుకున్న వారిలో ఎక్కువ శాతం మంది సక్సెస్‌ అయ్యారు.

ఆయన పడ్డ కష్టంకు, వారు చూపిన ప్రతిభకు ప్రభుత్వ ఉద్యోగంలో ఇప్పుడు ఉన్నారు.

Telugu Telugu Ups, Yedukondalu Sir-

  ఎంతో మందికి ఆదర్శంగా నిలవడంతో పాటు, పలువురు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కారణం ప్రస్తుత సీఐ సారు ఏడు కొండలు సారు.ఈయన చిన్న తనంలో ఆర్ధిక లేమి కారణంగా ఒక సంవత్సరం స్కూల్‌ కూడా మానేశాడు.ఆ తర్వాత ఇతరుల ప్రోత్సాహం మరియు సాయం కారణంగా చదివి ఉన్నత విద్యావంతుడు అయ్యి ఉద్యోగం సంపాదించాడు.తనలా ప్రోత్సాహం లేని వారిని వెదికి పట్టుకుని వారికి సాయం చేయాలనే ఉద్దేశ్యంతో నల్లగొండలో ఉచిత కాంపిటీటివ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.10.20 నుండి ప్రారంభం అయిన ఆ సెంటర్‌ ఏకంగా వెయ్యికి చేరింది.

Telugu Telugu Ups, Yedukondalu Sir-

 

వెయ్యి మంది స్టూడెంట్స్‌ ఏడుకొండలు సారు క్లాసులు వినేందుకు వచ్చేవారు.నల్లగొండలో ఎస్సైగా ఉన్న సమయంలో ఏడుకొండలు సారు ఉదయం 7 నుండి 8.30 వరకు క్లాసులు చెప్పే వారు.ఇక సాయంత్రం సమయంలో 5 నుండి 7 గంటల వరకు క్లాసులు చెబుతూ ఉండేవారు.మద్యలో ఖాళీ సమయంలో తనకు సన్నిహితులు అయిన సబ్జెక్ట్‌ నిపుణులను తీసుకు వచ్చి విద్యార్థులకు క్లాసులు చెప్పేవాడు.

ఏడుకొండలు సారు చెప్పిన కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ అవైర్నెస్‌, మ్యాథ్స్‌ అన్నింట్లో కూడా విద్యార్థులు మంచి ప్రావిణ్యం సంపాదించే వారు.

Telugu Telugu Ups, Yedukondalu Sir-

  ప్రతి పోటీ పరిక్షకు ఉపయోగపడే విధంగా ఏడుకొండలు సారు టీచింగ్‌ ఉండేది.నల్లగొండ నుండి ట్రాన్సపర్‌ అయ్యి నాగర్‌ కర్నూలు వెళ్లిన కూడా ఏడుకొండలు సారు తన పట్టుదలను వదల్లేదు.హెచ్‌డీ వీడియో సిస్టంతో అక్కడ నుండే విద్యార్థుళకు శిక్షణ ఇచ్చే వారు.

సారు చెప్పే పాఠాల కోసం విద్యార్థులు సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చే వారు.ఎంతో మంది పేద విద్యార్థులకు ఏడు కొండలు సారు సాయం చేశాడు.

ఆన్‌లైన్‌లో పాటలు చెబుతూ ఎప్పటికప్పుడు విద్యార్థుల నాలెడ్జ్‌ను కూడా టెస్టు చేస్తూ ఉండేవారు.

నల్లగొండ నుండి వెళ్లి పోయిన తర్వాత నాగర్‌ కర్నూలులో కూడా ఒక బ్యాచ్‌ను ఏర్పాటు చేయడం అక్కడ కొందరు నిరుద్యోగులకు తనవంతు సాయం చేస్తూ, తన నాలెడ్జ్‌ను పంచడం చేశాడు.

అలా కొన్ని వందల మంది ఇప్పుడు ఏడుకొండలు సార్‌ వల్ల మంచి ఉద్యోగాల్లో సెటిల్‌ అయ్యారు.ఆయన వల్ల ఉద్యోగం సాధించిన ఎంతో మంది ప్రస్తుతం వివిధ రంగాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నారు.

ప్రైవేటు రంగాల్లో కూడా ఏడుకొండలు సారు దయవల్ల చేరిన వారు ఉన్నారు.అందుకే ఈ సారుకు ఒక సెల్యూట్‌ చేసి ఈ గొప్ప మనిషి గురించి షేర్‌ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube