'నాని గ్యాంగ్‌లీడర్‌' హిట్టా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్!

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సహజ నటుడు నాని సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి.ఇక ఆ చిత్రానికి గ్యాంగ్‌ లీడర్‌ అంటూ పేరు పెట్టడంతో ఆ అంచనాలు మరింతగా పైకి చేరాయి.

 Nanis Gang Leader Movie Review And Ratings-TeluguStop.com

అయితే టైటిల్‌ విషయంలో వివాదం ఏర్పడటంతో గ్యాంగ్‌ లీడర్‌ కాస్త నాని గ్యాంగ్‌ లీడర్‌ అయ్యింది.జెర్సీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నాని ఈ చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ఈ చిత్రం మొత్తం ఒక దొంగతనం చుట్టు తిరుగుతుంది.దొంగతనం వల్ల సఫర్‌ అయిన విభిన్న వయస్కులు అయిన అయిదుగురు మహిళలు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తారు.

అందుకోసం ఒక లీడర్‌ను చూసుకోవాలని భావించి పెన్సిల్‌(నాని)ని కలుస్తారు.స్వతహాగా క్రైమ్‌ కథల రచయిత అయిన పెన్సిల్‌ వారికి అండగా నిలిచి వారు ప్రతీకారం తీర్చుకునేందుకు సాయం చేస్తాడు.

ఆ క్రమంలో పెన్సిల్‌ ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ, ఇంతకు ఆ లేడీ గ్యాంగ్‌కు దొంగతనంకు సంబంధం ఏంటీ? అనేది సినిమా చూసి తెలుసుకోండి.

Telugu Gang, Nani, Nani Gang, Nani Gang Day, Praanaya-Telugu Movie Reviews

 

నటీనటుల నటన :

నాని ఎప్పటిలాగే మరోసారి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.జెర్సీ చిత్రంలో చాలా సీరియస్‌ పాత్రలో అలరించిన నాని ఈ చిత్రంలో పూర్తి విభిన్నంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసి నవ్వించాడు.గతంలో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా తన టైమింగ్‌తో కామెడీ పంచ్‌లు పేల్చి సినిమాకు హైలైట్‌గా నిలిచాడు.

ఆ లేడీ గ్యాంగ్‌తో ఇబ్బందులు పడుతూ ఫ్రస్టేట్‌ అవుతూ ఫన్నీగా నవ్వు తెప్పించాడు.ఇక కార్తికేయ నటన కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.నాని, కార్తికేయల మద్య సన్నివేశాలు బాగున్నాయి.ఇక హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌మోహన్‌ తన పాత్రకు న్యాయం చేసింది.

ఆమె ఎక్కువగా సీరియస్‌గానే కనిపించింది.రొమాంటిక్‌ సీన్స్‌ పెద్దగా లేకపోవడంతో ఎక్కువగా ఒకే ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించింది.

లేడీ గ్యాంగ్‌లోని లక్ష్మీ ఇంకా ఇతరులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేయడంతో పాటు నవ్వించారు.వెన్నెల కిషోర్‌ కామెడీ సీన్స్‌ ఆకట్టుకున్నాయి.ఇతరులు వారి పాత్రల పరిధిలో నటించారు.

టెక్నికల్‌ :

దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే కథను ఇంకాస్త బలంగా తయారు చేసుకుని ఉంటే బాగుండేది.డైలాగ్స్‌ కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉన్నాయి.సంగీతం పర్వాలేదు అనిపించింది.రెండు మూడు పాటలు ఆకట్టుకున్నాయి.

అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగా వచ్చింది.సినిమాలోని పలు సీన్స్‌ హైలైట్‌ అయ్యేలా ఉంది.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.కొన్ని సీన్స్‌ విభిన్నంగా ఉండటంతో సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది.

ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు మినహా అంతా బాగానే ఉంది.

Telugu Gang, Nani, Nani Gang, Nani Gang Day, Praanaya-Telugu Movie Reviews

 

విశ్లేషణ :

జెర్సీ వంటి విభిన్న చిత్రం చేసిన కొన్ని నెలల్లోనే నాని ఈ చిత్రంను చేసి ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.ఆ చిత్రం తాలూకు ఆలోచనలు, జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి.అప్పుడే గ్యాంగ్‌ లీడర్‌ సందడి మొదలైంది.

తమిళ దర్శకుడు అయినా కూడా విక్రమ్‌ కుమార్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్‌ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మనం చిత్రంతో ఆయన సాధించిన విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు.

తమిళంలో ఆయన చేసిన సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అందుకే గ్యాంగ్‌ లీడర్‌పై మొదటి నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి.

అంచనాలను అందుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.సినిమా నుండి ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుతున్నారు.

అది ఈ చిత్రంలో పుష్కలంగానే ఉంది.నాని హీరోగా అనగానే ఒక వర్గం ప్రేక్షకులు ఫన్‌ను ఆశిస్తారు.

గ్యాంగ్‌లీడర్‌లో మస్త్‌ ఫన్‌ను దర్శకుడు పెట్టాడు.అయితే కథను ఇంకాస్త బలంగా తయారు చేసుకుని స్క్రిప్ట్‌లో ట్విస్ట్‌లకు చోటు ఇచ్చి ఉంటే సినిమా ఫలితం మరింత హై రేంజ్‌లో ఉండేది.ప్రస్తుతంకు ఈ చిత్రం పర్వాలేదు, చూడవచ్చు, ఎంటర్‌టైనర్‌గా ఉంది.

ప్లస్‌ పాయింట్స్‌ :

నాని,
కార్తికేయ,
లేడీ గ్యాంగ్‌ కామెడీ,
వెన్నెల కిషోర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

మైనస్‌ పాయింట్స్‌ :

స్టోరీ లైన్‌ వీక్‌, కొన్ని సీన్స్‌ సహజంగా అనిపించలేదు, రొమాంటిక్‌ ఎలిమెంట్స్‌ లేవు.

రేటింగ్‌ : 3.0/5.0

బోటం లైన్‌ : నాని ‘గ్యాంగ్‌లీడర్‌’గా ఎంటర్‌టైన్‌ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube