విడ్డూరం : రోడ్లు బాగుంటే యాక్సిడెంట్స్‌ అవుతాయన్న డిప్యూటీ సీఎం

దేశంలో కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన విషయం తెల్సిందే.ఆ ఫైన్‌లు కట్టలేక కొందరు సామాన్యులు ఏ స్థాయిలో రియాక్ట్‌ అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Karnataka Deputy Cm Comments On Road Accidents-TeluguStop.com

మరో వైపు సోషల్‌ మీడియాలో కొత్త వాహన చట్టంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.రోడ్లు అయితే బాగుండవు కాని ఇలా వాహన చట్టం అంటూ భారీగా ఫైన్స్‌ వసూళ్లు చేయడం ఏంటీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

రోడ్లు బాగున్నప్పుడు మాత్రమే ఫైన్‌ వసూళ్లు చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ సమయంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్‌ కర్జోల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్‌ మాట్లాడుతూ.దేశంలో ఎక్కువగా జరుగుతున్న యాక్సిడెంట్స్‌కు కారణంగా రోడ్లు బాగుండటమే అన్నాడు.రోడ్లు బాగుండటం వల్ల చాలా స్పీడ్‌గా వెళ్లడం దాంతో యాక్సిడెంట్స్‌కు గురవ్వడం చేస్తున్నారు అంటూ గోవింద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.కర్ణాటకలో ప్రతి ఏడాది 10 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

అందులో భారీ ఎత్తున జనాలు కూడా చనిపోతున్నారు.దీనికంతటికి కారణం రోడ్లు బాగుంటం వల్లే అంటూ ఆయన వింత వాదన తీసుకు వచ్చాడు.

డిప్యూటీ సీఎం గోవింద్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఒక డిప్యూటీ సీఎం పదవిల ఉండి గల్లీ లీడర్‌ తరహాలో మీరు మాట్లాడుతున్నారు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube