ఏపీలో కొత్త జిల్లాలకు ముహూర్తం ఖరారు

ప్రత్యేక రాష్ట్రం అయిన వెంటనే తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.ప్రస్తుతం రాష్ట్రం కొత్త జిల్లాల ప్రాతిపధికనే పరిపాలన కొనసాగిస్తున్న విషయం తెల్సిందే.

 Jagan Mohan Reddyplan Toestablished Some Moredistict In Andhrapradesh Ycp-TeluguStop.com

అయితే ఏపీలో మాత్రం కొత్త జిల్లాల విషయం గత కొన్ని సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది.చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలోనే కొత్త జిల్లాలను చేయాలని భావించారు.

కాని కొన్ని కారణాల వల్ల అప్పుడు సాధ్యం కాలేదు.ఇప్పుడు మళ్లీ జగన్‌ హయాంలో కొత్త జిల్లాల గురించిన చర్చ మొదలైంది.

కొత్తగా పది జిల్లాలను పెంచాలనే ఉద్దేశ్యంతో జగన్‌ అండ్‌ కో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఏపీలో ఉన్న పార్లమెంటు స్థానాలన్నీ జిల్లాలుగా ప్రకటించాలని మొదట భావించారు.

ఆ తర్వాత నిర్ణయంలో మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది.జగన్‌ సీఎం అయ్యి 100 రోజులు అయిన సందర్బంగా నిర్వహించిన ఒక సమీక్ష సమావేశంలో కొత్త జిల్లాలకు సంబంధించిన చర్చ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

కొత్త జిల్లాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని, ఆ విషయమై తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అధికారులతో జగన్‌ చెప్పాడట.ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర భూ సర్వే తర్వాత కొత్త జిల్లాల పక్రియ ప్రారంభం కాబోతుంది.

కొత్త జిల్లాలను వచ్చే ఏడాది రాబోతున్న రిపబ్లిక్‌ డే సందర్బంగా అంటే జనవరి 26, 2020లో ఏర్పాటు చేయబోతున్నారు.ఆ రోజు నుండే కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభం కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube