హిందుగాళ్లు బొందుగాళ్లు అన్నందుకు కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయరా?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు గాను జగిత్యాల జిల్లాకు చెందిన బానావత్‌ లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.

 Banoth Lakshmionce Againcomments On Kcr Trs-TeluguStop.com

బెయిల్‌పై విడుదల అయిన తర్వాత మరోసారి లక్ష్మీ ఒక వీడియోలో కేసీఆర్‌ గురించి మాట్లాడింది.నేను ఒక మహిళలను అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా పోలీసులు 6 గంటల పాటు నిర్భందించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

గతంలో కేసీఆర్‌ గారు హిందూ గాళ్లు బొందుగాళ్లు అంటూ ఇష్టానుసారంగా మాట్లాడాడు.ఆయన మాటలకు ఎవరు ఎందుకు కేసు పెట్టలేదు.పోలీసులు ఆయన్ను ఎందుకు అరెస్ట్‌ చేయరు అంటూ ప్రశ్నించింది.ఒక మహిళ రైతుగా తాను ఎంతగానో బాధ అనుభవించాను కనుక ఆ సమయంలోనే నేను అలా మాట్లాడాను.

ఆమాత్రం అర్ధం చేసుకోలేరా అంటూ ప్రశ్నించింది.నన్ను అరెస్ట్‌ చేసి మొత్తం మహిళ రైతులను అవమాన పర్చారు అంటూ లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube