'సైరా' టికెట్స్‌కు 'బై వన్‌ గెట్‌ వన్‌' ఆఫర్‌

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ‘సాహో’ చిత్రం విడుదల అవ్వడం, ఆపై పోవడం కూడా జరిగి పోయింది.ఇప్పుడు అంతా కూడా సైరా కోసం ఎదురు చూస్తున్నారు.

 Sairamovie Ticketsgiving The Oneplus Oneoffer Ramcharan-TeluguStop.com

మరో రెండు లేదా మూడు వారాల్లో సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.సినిమాను ప్రస్తుతం అక్టోబర్‌ 2న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన అయితే వచ్చింది.

కాని సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.వారం రోజులు ఆలస్యంగా దసరా సందర్బంగా సినిమాను విడుదల చేసే విషయమై పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Chiranjeevi, Prabhas, Ramcharan India, Sahoo, Saira, Premier Show-

  విడుదల ఎప్పుడు ఉన్నా కూడా అమెరికాలో ముందు రోజే షో పడబోతుంది.ఖైదీ నెం.150 చిత్రం ప్రీమియర్ల రూపంలో భారీ మొత్తంను రాబట్టిన విషయం తెల్సిందే.అందుకే సైరాను కూడా ముందు రోజే యూఎస్‌లో భారీ ఎత్తున విడుదల చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఓపెనింగ్స్‌తోనే సరికొత్త రికార్డును సృష్టించాలనే ఉద్దేశ్యంతో టికెట్లకు ఆఫర్‌లు పెట్టడం జరిగింది.ప్రీమియర్‌ షో టికెట్టు ఒక్కటి కొంటే మరోటి ఉచితం అన్నట్లుగా ప్రకటించారు.అయితే ఆ ఒక్కదాని రెంటు రెండు టికెట్ల రేట్ల అంత ఉండవచ్చు అంటూ కొందరు అంటున్నారు.

Telugu Chiranjeevi, Prabhas, Ramcharan India, Sahoo, Saira, Premier Show-

  సైరా చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అదే విధంగా యూఎస్‌లో కూడా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.మెగాస్టార్‌ ఫ్యాన్స్‌ భారీ ఎత్తుగా ఉన్నారు.యూఎస్‌లో కేవలం తెలుగు వర్షన్‌ మాత్రమే కాకుండా తమిళం మరియు హింధీ వర్షన్‌ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.

హిందీ మరియు తమిళ వర్షన్‌ల టికెట్లకు ఈ ఆఫర్‌ వర్తించక పోవచ్చు.అలాగే ఆ వర్షన్‌ల టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉంటాయని అంటూ ఉన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube