జాన్‌బొల్టన్ రాజీనామాపై స్పందించిన ట్రంప్

జాతీయ భద్రతా సలహాదారు జాన్ బొల్టన్ రాజీనామా విషయంలో తొలిసారి స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.బుధవారం ఓవల్ ఆఫీసులో బొల్టన్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.

 Donald Trump Made It Clear A Day After Firing National Security Adviser-TeluguStop.com

ఆఫ్గనిస్తాన్, ఇరాన్‌ల విషయంలో తాను అవలంభించిన విధానాలను బొల్టన్ తప్పుబట్టారని ట్రంప్ ప్రస్తావించారు.

Telugu John Bolton, Telugu Nri Ups, Trump-

  ఇరాక్, ఉత్తర కొరియాలపై తన మాజీ భద్రతా సలహాదారు ఇచ్చిన ప్రతిపాదనలకు ఏమాత్రం విలువ ఇవ్వలేదన్నారు.ఇరాన్, ఉత్తర కొరియాలపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే సైనిక చర్యకు దిగాలని బొల్టన్ తనతో అన్నారని ట్రంప్ గుర్తు చేశారు.అయితే ఈ రెండు దేశాల సైనిక శక్తిని తాను తక్కువగా చూడలేదని.

ఇరాన్‌పై విధించిన ఆంక్షలను సడలించేందుకు తాను ప్రయత్నించానని అయితే బొల్టన్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నారని తెలిపారు.

Telugu John Bolton, Telugu Nri Ups, Trump-

  వెనుజులా, అలాగే లిబియాకు వ్యతిరేకంగా యూరోపియన్ మిలిటరీ యాక్షన్‌లో అమెరికా చేరడాన్ని జాన్ బొల్టన్ తప్పుబట్టారని ట్రంప్ గుర్తుచేశారు.ఇలాంటి ఎన్నో విషయాలపై తమ మధ్య విభేదాలు రావడంతో ఆయనపై అసహనం వ్యక్తం చేశానని అంతిమంగా ఇది జాన్ రాజీనామాకు దారితీసిందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube