అమెరికాలో వింత దొంగ..ఇలా దొరికిపోయాడేంటి..!

అమెరికాలో ఓ దొంగ దొరికిపోయిన వైనం వింటే నవ్వు ఆపుకోలేరు.దొంగతనానికి వెళ్ళిన ఓ దొంగ అన్నీ దోచేసుకున్న తరువాత పారిపోకుండా ఆ దొంగ చేసిన వింత పని ఇప్పుడు అందరిని కడుపుబ్బా నవుకునేలా చేస్తోంది.

 This Man Found Differently In The Girl Room Girl Bedroom In America-TeluguStop.com

ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు తో ఆ దొంగని పట్టుకున్నారు.కానీ దొంగ చేసిన ఆ పని ఎందుకు చేశాడో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు పోలీసులు.

వివరాలలోకి వెళ్తే.

Telugu American Thief, Theef, Telugu Nri Ups, Thief-

 

చికో స్టేట్ యూనివర్సిటీ కి చెందిన ఓ విద్యార్ధిని నార్త్ కాలిఫోర్నియా లో ఓ అపార్ట్మెంట్ లో ఉంటోంది.ఓ రోజు ఓ దొంగ ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ లోని తన రూమ్ లోకి వచ్చి ఎంతో విలువైన వస్తువులు దొంగిలించాడు.ఈ క్రమంలోనే వెళ్తూ వెళ్తూ ఆమె గాఢ నిద్రలో ఉండగా నగ్నంగా ఆమె పక్కనే పడుకున్నాడు.

ఉదయం లేవగానే ఆమె అతడిని చూసి ఒక్కసారిగా పెద్ద పెద్ద అరుపులు వేస్తూ బయటకి వెళ్ళిపోయింది.

Telugu American Thief, Theef, Telugu Nri Ups, Thief-

  ఈ క్రమంలోనే దొంగ కూడా పారిపోయాడు.ఆ తరువాత ఆమె జరిగిన ఉదంతం అంతా పోలీసులకి ఫిర్యాదు రూపంలో అందించింది.విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా సాయంతో అతడిని అతి కష్టంమీద పట్టుకున్నారు.

వస్తువులు అన్నీ దొంగిలించి నువ్వు దర్జాగా వెళ్లిపోవచ్చు కానీ ఎందుకు ఆమె పక్కన నగ్నంగా పడుకున్నావు అని ఎంత అడిగినా ఆ దొంగ నోరు విప్పడం లేదట.దాంతో అసలు దొంగ దొంగిలిచిన వస్తువులకంటే కూడా ఆమె పక్కన అలా ఎందుకు పడుకున్నాడో అనేది పెద్ద చర్చగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube