వీసా లేకుంటే దిగిపోండి: హరికేన్ బాధితులతో దురుసు ప్రవర్తన, క్షమాపణలు

కష్టాల్లో ఉన్న వారిని చూస్తే ఎవరికైనా జాలి చూపించాలనిపిస్తుంది.వీలైతే సాయం చేయాలి లేకుంటే వారి గురించి భగవంతుడని ప్రార్థించడమో చేయాలి.

 Ferryoperator Apologizes To Bahamianevacuees Over Comments On America Visa-TeluguStop.com

కానీ ఓ వ్యక్తి మాత్రం బాధితులనుద్దేశించి జాత్యంహర వ్యాఖ్యలు చేశాడు.వివరాల్లోకి వెళితే.

ప్రచండ గాలులతో విరుచుకుపడిన డోరియన్ హరికేన్ ధాటికి ఫ్లోరిడాలోని బహమాస్ దీవులు నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి.

Telugu Ferry, Telugu Nri Ups-Telugu NRI

  50 మంది వరకు మరణించగా.ఇప్పటికీ వందలాది మంది జాడ తెలియరాలేదు.సుమారు 70,000 మంది నిరాశ్రయులైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా.

నష్టం ఇంకా తీవ్రంగానే ఉండవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో బహమాస్ దీవుల్లో సర్వం కోల్పోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పడవలను ఏర్పాటు చేశారు.

సోమవారం బహమాస్ నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడర్డబుల్ వెళ్లేందుకు సుమారు 119 మంది హరికేన్ బాధితులు ఒక ఫెర్రి ఎక్కారు.

Telugu Ferry, Telugu Nri Ups-Telugu NRI

 

అయితే ఆ సమయంలో ఫెర్రి నడుపుతున్న వ్యక్తి….వీసా లేకుండా అమెరికాలో ఉన్న వారు బోటు దిగాలంటూ గట్టిగా ప్రకటించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు వ్యక్తి బాధితులకు క్షమాపణలు చెప్పాడు.

అటు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డిపార్ట్‌‌మెంట్ శాతం.ఫెర్రి ఆపరేటర్‌ తీరును తప్పుబట్టింది.అతను బాధితులతో ఆ విధంగా ప్రవర్తించి ఉండకూడదని స్పష్టం చేసింది.ఫెర్రి యాజమాన్య సంస్థ.

బలేరియా కరేబియన్ సైతం.బాధితులకు కలిగిన కష్టానికి క్షమాపణలు చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube