ఆదర్శం : శ్రీకాకుళం ప్రభుత్వ స్కూల్‌ నుండి 'చంద్రయాన్‌ 2' వరకు ఈ బాలిక జర్నీ అద్బుతం

భారత అంతరిక్ష పరిశోదన సంస్థ ఇస్రో తాజాగా చేపట్టిన చంద్రయాన్‌ 2 ప్రయోగం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని కనబర్చారు.చంద్రయాన్‌ 2 ప్రయోగం ఆరంభ రోజు నుండి దాని గమనం మరియు ప్రయోగ వివరాలను తెలుసుకునేందుకు నాసా శాస్త్రవేత్తల నుండి సాదారణ జనాల వరకు ఆసక్తి చూపించారు.

 Idol Girl Chandrayaan 2 Landing Live View Winner Ap Government School Girl Kanc-TeluguStop.com

చంద్రుడిపై మనం వెళ్లబోతున్నామా, మన గుర్తు అక్కడ పడబోతుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఇండియన్స్‌ ఎదురు చూశారు.

Telugu Chandrayaan, Chandrayaanlive, Kanchana, Telugu Ups-Inspirational Storys

  చివరి గట్టం విక్రమ్‌ ల్యాండర్‌ నుండి రోవర్‌ బయటకు రావడం.దీన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఆసక్తి చూపించారు.ఈ విషయాన్ని గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడి మోడీ కూడా తాను స్వయంగా బెంగళూరు స్పెస్‌ సెంటర్‌లో లైవ్‌ను వీక్షిస్తానంటూ చెప్పాడు.

ఇక మోడీతో లైవ్‌ను చూసే అవకాశం కొంత మంది పిల్లలకు ఇస్తే బాగుంటుందని ఇస్రో భావించింది.రాష్ట్రంకు ఇద్దరు చొప్పున తీసుకోవాలని నిర్ణయించారు.దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తంగా కొన్ని వేల మంది ఇస్రో నిర్వహించిన క్విజ్‌ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Telugu Chandrayaan, Chandrayaanlive, Kanchana, Telugu Ups-Inspirational Storys

  ఈ క్విజ్‌ పోటీలో కేంద్రీయ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు మరియు ప్రముఖ కార్పోరేట్‌ స్కూల్స్‌కు సంబంధించిన విద్యార్థులు ఎంపిక అయ్యారు.అయితే మన తెలుగు అమ్మాయి ప్రగడ కాంచన బాలశ్రీ దేశంలోనే ప్రత్యేకం అనిపించుకుంది.ఒక రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల నుండి ఈమె ఎంపిక అయ్యింది.

శ్రీకాకులం జిల్లాకు చెందిన ఈ బాలిక తాను అనుకున్నట్లుగా చంద్రయాన్‌ ప్రయోగంను చూసేందుకు, ప్రధాని మోడీతో కలిసి కూర్చోవాలనే ప్రయత్నంతో ఆమె కఠోరంగా శ్రమించింది.

Telugu Chandrayaan, Chandrayaanlive, Kanchana, Telugu Ups-Inspirational Storys

  చంద్రయాన్‌ 2 ప్రయోగం ప్రారంభం అయినప్పటి నుండి వివరాలను విషయాలను తెలుసుకోవడంతో పాటు, గతంలో ఇస్రో ప్రయోగించిన రాకెట్లు, శాటిలైట్స్‌ ఇంకా అనేక రకాల పరిశోదనలు గురించి ఆమె చదివింది.తన ఫిజిక్స్‌ సర్‌ను ఆమె అడిగిన ప్రశ్నలకు ఆయనకే కొన్ని సార్లు అనుమానం వచ్చేది.ఆమెకు వచ్చిన ప్రతి అనుమానంను ఆ మాస్టారు క్లీయర్‌ చేయడంతో పాటు, ఇంటర్నెట్‌ నుండి అనేక మైన సమాచారంను కాంచనకు ఇవ్వడం జరిగింది.

ఆమె ఫైనల్‌ పరీక్షను చేరుకునేందుకు చాలానే కష్టపడింది.

Telugu Chandrayaan, Chandrayaanlive, Kanchana, Telugu Ups-Inspirational Storys

  వేలాది మంది ప్రయత్నిస్తున్న ఈ పరీక్షలో ఆమెకు ఖచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకం లేదు.కాని విజయం సాధించాలనే పట్టుదల మాత్రం ఉంది.ఆ పట్టుదలతో తీవ్రంగా ప్రయత్నించింది.

ఒక ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థి ఏ స్థాయికి చేరుతాడో అనే విషయాన్ని తన రూపంలో మళ్లీ నిరూపించాలని భావించింది.ప్రస్తుత ఇస్రో చైర్మన్‌ ఒక ప్రభుత్వ స్కూల్‌లో చదువుకున్న విద్యార్థి.

ఆయనను ప్రేరణగా తీసుకుందో ఏమో కాని కాంచన అనుకున్నది సాధించింది.చంద్రయాన్‌ 2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలం అయ్యింది.

ఆ విషయాన్ని పక్కన పెట్టి కాంచన పట్టుదలతను అంతా అభినందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube