40 వేల కోట్లు తగ్గిన కేసీఆర్‌ బడ్జెట్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019-20 సంవత్సరానికి గాను అసెంబ్లీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం జరిగింది.ప్రతి సంవత్సరం బడ్జెట్‌ పెరుగుతూ వస్తుంది.

 Inassembly Kcr Presentsthebudjet Trs-TeluguStop.com

కాని ఈసారి మాత్రం బడ్జెట్‌ తగ్గడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.మొనటి ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అంటూ కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అంచనా 1.82 లక్షల కోట్లు.కాని నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అంచన 1.46 లక్షల కోట్లు.గతంతో పోల్చితే దాదాపుగా 40 వేల కోట్లు తగ్గినట్లుగా తెలుస్తోంది.

ఈ తగ్గుదలకు కారణాలు కూడా కేసీఆర్‌ ప్రకటించారు.

దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఆ కారణంగానే ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి కూడా సరిగా లేదన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని, అన్ని విషయాల్లో కూడా తెలంగాణను ముందు ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

రాష్ట్రం వచ్చిన మొదటి ఏడాది నెలకు 6,247 కోట్లు ఖర్చు అయ్యేది.కాని ప్రస్తుతం నెలకు 11305 కోట్లు ఖర్చు అవుతుందన్నాడు.

ఆర్ధిక లోటు 24 వేల కోట్లు ఉండబోతున్నట్లుగా కేసీఆర్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube