కేసీఆర్‌ ఆ సాహస నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు తన మంత్రి వర్గంను విస్తరించబోతున్నారు.నేడు ఉదయం కొత్త గవర్నర్‌గా తమిళిసై ప్రమాణ స్వీకారం చేశారు.

 Telangana Cmkcr No Changes In Cabinet Ministers-TeluguStop.com

నేడు సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు.కొత్త మంత్రుల పేర్లు ఇప్పటికే ఖరారు అయ్యింది.

అంతా అనుకుంటున్నట్లుగానే సబితా ఇంద్రా రెడ్డికి ఛాన్స్‌ దక్కింది.మహిళలకు ఛాన్స్‌ ఇవ్వడం లేదనే విమర్శను పోగొట్టుకునేందుకు మరో మంత్రి పదవిని కూడా లేడీకే ఇచ్చాడు.

సత్యవతి రాథోడ్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కబోతుంది.</br>

ఇక గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్నట్లుగానే హరీష్‌ మరియు కేటీఆర్‌లకు కూడా ఛాన్స్‌ ఇవ్వనున్నారు.

మరో ఇద్దరు గంగుల కమలాకర్‌ మరియు పువ్వాడ అజయ్‌లకు కూడా మంత్రి పదవి దక్కనుంది.అయితే కేసీఆర్‌ తన మంత్రి వర్గం నుండి ముగ్గురు లేదా అయిదుగురును తొలగించి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

మల్లారెడ్డి మరియు ఈటెల పేర్లు ప్రముఖంగా వినిపించాయి.కాని ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రులను తొలగించడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని, పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని కేసీఆర్‌ భావించి ఆ సాహస నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది.

ఇకపై కూడా కేసీఆర్‌ ఆ సాహస నిర్ణయం తీసుకుంటాడని అనుకోవడం లేదు.ఎందుకంటే బీజేపీ కేసీఆర్‌ ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడా అంటూ కాచుకుని కూర్చుంది.

టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube