కెనడాలో పెరిగిపోతున్న ఇస్లామోఫోబియా: నిర్మూలించేందుకు జగ్మీత్ వ్యూహం

కెనడాలో ఇటీవలి కాలంలో జాత్యహంకార దాడులు, ఇస్లామోఫోబియాను అదుపు చేందుకు ఆ దేశంలో మూడవ అతిపెద్ద పార్టీ అయిన న్యూడెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ ప్రణాళిక రచిస్తున్నారు.జాత్యహంకారం ప్రభావం అన్న అంశంపై టోరెంటో లోని టౌన్‌ హాలులో జరిగిన సమావేశంలో జగ్మీత్ పాల్గొన్నారు.

 Federal Ndp Leader Jagmee Singh Has A Plan To Combat Racism And Islamophobia-TeluguStop.com

ఈ సందర్భంగా జాత్యహంకారం, ఇస్లామిక్ మతం పట్ల దేశంలో పెరిగిపోతున్న విద్వేషభావాలపై మేథావులు, నేతలతో చర్చించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.జాత్యహంకార దాడులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు.అలాగే ఇస్లామోఫోబియాను నియంత్రించడమన్నది తమ పార్టీ సిద్ధాంతాలలో ఒకటని పేర్కొన్నారు.

ప్రజలు ఇప్పటికే జాత్యహంకారం, ఇస్లామోఫోబియాలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారని జగ్మీత్ తెలిపారు.ఎన్నికలకు సంబంధించిన ఈ టౌన్ హాలులో మొట్టమొదటిసారిగా కెనడా ముస్లింకు చెందిన ఓ సమావేశం జరగడం ఇదే ప్రథమం.

ఇదే సమావేశంలో తమ పార్టీకి ప్రజల నుంచి విరాళాలు అనుకున్న స్థాయిలో రావడం లేదని సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.కాగా.గతేడాది కెనడాకు చెందిన ఓ మహిళా పాక్ పౌరుడిని వివాహం చేసుకుంది.

Telugu Canadian Press, Gender, Race-

అనంతరం కెనడా నుంచి పాకిస్తాన్‌కు వచ్చి ఇక్కడి ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించింది.పలు దేశాల్లో ఇస్లాం మతం పట్ల విద్వేషభావాలు పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ… ఇస్లామోఫోబియాను విడనాడాలని ప్రజలకు సందేశం ఇచ్చింది.అయితే ఏప్రిల్‌లో పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఓ కెనడా మహిళ షాపింగ్‌కు వెళ్లగా.

అక్కడ ఆమెను ఇద్దరు పోకిరీలు అసభ్యపదజాలంతో దూషించారు.అలాగే సదరు మహిళ కారు డ్రైవర్‌ను బెదిరించి వ్యక్తిగత వివరాలు సేకరించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ సంఘటనపై కెనడీయులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube