టాలీవుడ్ మెగా నందమూరి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.బాహుబలి మేకర్ అయిన రాజమౌళి నుండి ఈ చిత్రం వస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు.స్వాతంత్య్రంకు పూర్వం కథాంశంతో ఈ చిత్రంను జక్కన్న తెరకెక్కిస్తున్నాడు.
పెద్ద ఎత్తున ఈ చిత్రంలో ఉండే యాక్షన్ సీన్స్‌తో సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ క్యూట్ బ్యూటీ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్న విషయం తెల్సిందే.ఆలియా పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఆలియా భట్‌ది కేవలం అతిధి పాత్ర మాత్రమే అని ఫస్ట్ హాఫ్‌లో వచ్చే నాలుగు అయిదు సీన్స్‌లో అంటే పావు గంట పాటు మాత్రమే ఆమె కనిపిస్తుందని, అందులో ఒక పాట కూడా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ చిత్రం కోసం ఆలియా భట్ ఏకంగా 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కేవలం 15 నిమిషాల పాత్ర కోసం అంతటి పారితోషికం ఆమె ఎలా తీసుకుంటుంది, చిత్ర నిర్మాత ఎలా ఇస్తాడు.అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా కూడా పుకార్లే అయ్యి ఉంటుందని టాక్ నడుస్తోంది.
ఆలియా భట్ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించనుందని, ఆమె పాత్రతో జక్కన్న యుద్దం కూడా చేయిస్తాడని అంటున్నారు.అందుకోసం ఆలియా కత్తి విద్యలో కూడా ప్రావిణ్యం సంపాదించింది.
అలాగే గుర్రపు స్వారీని కూడా ఆమె నేర్చుకుందట.