గ్రేట్‌ ఇండియన్స్‌ : ఆ మసీదును చూసుకునే వాళ్లంగా హిందువులే, అక్కడ ఒక్క ముస్లీం ఉండరు

భారత దేశానికి హిందూ దేశం అంటూ పేరు పడ్డా కూడా ఇక్కడ ఎన్నో మతాల వారు మరియు జాతుల వారు ఉంటారు.హిందువుల జనాభ ఎక్కువగా ఉన్నా కూడా ఆధిపత్యం మాత్రం హిందువులు చేయరు.

 In Bihar Hindhulocals Takecare Of Muslimsmasque Villages-TeluguStop.com

ముస్లీంలతో పాటు వందలాది జాతుల వారు ఇండియాలో ఉంటున్నారు.అందుకే ఇండియా గురించి మాట్లాడుకునే సమయంలో భిన్నత్వంలో ఏకత్వం అంటూ చెప్పుకుంటూ ఉంటారు.

ఒక్కటి రెండు చోట్ల ముస్లీంలతో హిందువులకు గొడవలు అవుతూ ఉంటాయి.కాని చాలా ఎక్కువ ప్రాంతాల్లో హిందూ ముస్లీం భాయి భాయి అన్నట్లుగా ఉంటారు.

ప్రస్తుతం నేను చెప్పబోతున్న విషయం హిందూ ముస్లీంల మద్య ఉన్న స్నేహ సంబంధాలను ప్రపంచానికి చాటింది.హిందువులు చూపిస్తున్న మంచి మనసుకు ప్రపంచమే నివ్వెర పోయే పరిస్థితి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.బీహార్‌ రాష్ట్రంలోని ఛారిత్రాత్మక పట్టనం నలంద సమీపంలో ఒక చిన్న గ్రామం ఉంటుంది.

ఆ గ్రామంలో ఒకప్పుడు హిందువులు మరియు ముస్లీంలు జీవనం సాగించే వారు.హిందూ ముస్లీం భాయి భాయీ అన్నట్లుగా ఉండే వారు.

అయితే కాల క్రమంలో ఆ ఊరు నుండి ముస్లీంలు వలసలు వెళ్లి పోయారు.జీవనాధారం కోసం కొందరు, మరి కొందరు ఇతరత్ర కారణాల వల్ల బయటకు వెళ్లి పోయారు.

Telugu Bihar, Muslimstemples, Biharlocals-

గతంలో పెద్ద ఎత్తున ముస్లీంలు ఆ గ్రామంలో ఉన్న కారణంగా ఒక పెద్ద మసీదు నిర్మించారు.హిందువుల కోసం ఒక పెద్ద గుడి ఎలా అయితే అక్కడ నిర్మించారో ముస్లీంల కోసం కూడా మసీదును ఏర్పాటు చేయడం జరిగింది.ఆ ఊరి నుండి ముస్లీంలు అంతా కూడా వెళ్లి పోయినా కూడా మసీదు ప్రతి రోజు శుభ్రం చేయడంతో పాటు, నవాజు కూడా చదువుతున్నారు.ఒక్క ముస్లీం లేకుండా ఇది ఎలా సాధ్యం అవుతుందని మీరు భావిస్తున్నారా.

ముస్లీంలకు బదులుగా హిందువులే ప్రతి రోజు మసీదును నిర్వహిస్తున్నారు.

ప్రతి రోజు ఉదయాన్నే గ్రామంకు చెందిన హిందువులే ముస్లీంల మసీదును శుభ్రం చేయడం జరుగుతుంది.

ఉదయం నుండి రాత్రి వరకు ఏ సమయంలో నవాజు చేయాల్సి ఉంటుందో ఆ సమయంలో మైక్‌ సెట్‌ ఆన్‌ చేస్తారు.గ్రామంలో ఒక్క ముస్లీం లేకున్నా కూడా మసీదుకు వచ్చిన ఢోకా ఏమీ లేదు.

ప్రతి విషయంలో కూడా మసీదును చాలా చక్కగా స్థానికులు చూసుకుంటున్నారు.

ఇక ఏదైనా ముస్లీం పండుగ సందర్బంగా పక్క గ్రామం నుండి లేదంటే గ్రామం నుండి వెళ్లి పోయిన ముస్లీంలు గ్రామంకు వస్తుంటారు.

పండుగ నిర్వహిస్తారు.ముస్లీంల పండుగను కూడా ఆ గ్రామస్తులు చాలా వైభవంగా నిర్వహిస్తారు.

తమ పండుగలు ఎంత ప్రత్యేకంగా తీసుకుంటారో అలాగే ముస్లీం పండుగలను కూడా తీసుకుని గ్రామంలో సందడి చేస్తూ ఉంటారు.అత్యంత విభిన్నమైన ఈ మసీదు గురించి తెలిసి ముస్లీం పెద్దలు ఆ గ్రామంను సందర్శించేందుకు వెళ్తూ ఉంటారు.

గ్రామం నుండి వెళ్లి పోయిన వారు మరియు ముస్లీం పెద్దలు వారి మసీదుకు సేవలు చేస్తున్న కారణంగా గ్రామస్తులకు సహాయ సహకారాలు, విరాళాలు ఇస్తూ ఉంటారు.గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మసీదు తమదే అన్నట్లుగా భావించి దానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకుంటారు.

తమ గుడి మాదిరిగా మసీదును కూడా క్లీన్‌గా ఉంచుకుంటూ చక్కగా అల్లాని పూజిస్తారు.ఎన్నో ఏళ్లుగా ముస్లీంలు లేకున్నా కూడా హిందువులతో నడువబడుతున్న మసీదుగా ఈ మసీదుకు రికార్డు ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube