పవన్ స్పీడ్ పెంచాల్సిన సమయం వచ్చేసిందా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎటువంటిదో ఆయన పుట్టినరోజు వేడుకలను చూస్తేనే అర్ధం అయిపొయింది.తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టినరోజును ఒక పండుగలా నిర్వహించారు.

 Pawan Kalyan Time Is Coming Hewant Speed Of Theparty Jagan-TeluguStop.com

రాజకీయాల్లో ఆయన గెలిచినా ఓడినా రాజే అంటూ అభిమానులు స్టేట్మెంట్ లు కూడా ఇచ్చారు.ఎవరికీ లేనంత స్థాయిలో పవన్ కు అభిమానులు ఉన్నా పొలిటికల్ గా వెనుకబడడానికి కారణం ఏంటో చాలా మందికి అర్ధం కాలేదు.

అయితే పవన్ పొలిటికల్ గా వేసిన తప్పదుగులు, అనుభవరాహిత్యం, ఆయనకు సరైన దిశా నిర్ధేశం చేసేవారు లేకపోవడంతో ఆ పరిస్థితి వచ్చినట్టుగా అందరూ అర్ధం చేసుకున్నారు.ఇక ఇప్పుడు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మరో మూడేళ్లలో జమిలి ఎన్నికలు వచ్చే సూచనలు ఉండడంతో ఇప్పటి నుంచే జనసేన కార్యకలాపాలు ముమ్మరం చేస్తే పొలిటికల్ గా మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.

Telugu Chandrababu, Janasena, Pawan Kalyan, Pawankalyan-Telugu Political News

అయితే జనసేన కు ప్రజాధారణ పెరగాలంటే పవన్ కొన్నికొన్ని నియమాలు పాటిస్తే కానీ ఆ పార్టీ కి అనుకున్నంత స్థాయిలో ప్రజాదరణ లభించదు.ధీనికోసం పవన్ మొదటిగా తన చుట్టూ ఎటువంటి వారిని ఉంచుకోవాలన్నది నిర్ణయించుకోవాలి.రెండోది టీడీపీతో కలిసి నడవాలని అనుకుంటున్నారా ? అన్నది తేల్చుకోవాలి.ఒకవేళ ఆ పార్టీతో కలిసి వెళ్లే ఉద్దేశం లేకపోతే తమ ప్రత్యర్థిగా భావించి అవసరమైనప్పుడు విమర్శలు చేయాలి లేకపోతే ఇప్పటివరకు పవన్ టీడీపీకి అనుకూల వ్యక్తి అనే అపవాదును ఇంకా మోయాల్సి వస్తుంది.

అలా కాదు బాబుతో కలిసి ప్రయాణిద్దాం అంటే పవన్ కు ఓ లాభం ఓ నష్టం కూడా ఉంటుంది.టీడీపీ తో కలవడం ద్వారా బలమైన మీడియా మద్దతు పవన్ కు లభిస్తుంది.

అలా కాకుండా టీడీపీని ప్రత్యర్థిగానే చూస్తే టిడిపి మీడియా మద్దతుతో పాటు టిడిపిని అభిమానించే ఓట్లు కోల్పోవాల్సి ఉంటుంది.

అదే సమయంలో జగన్ , చంద్రబాబుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని అనుకున్నా బాగానే ఉంటుంది.

అప్పుడు జగన్ బాబు ను వ్యతిరేకించే సామాజికవర్గాల ఓట్లు పవన్ కు దక్కుతాయాయి.అయితే చంద్రబాబు విషయంలో పవన్ తన చిత్తశుద్దిని తొందరగా బయటపెట్టుకోవాలి.

పాతికేళ్ళు రాజకీయాల్లో ఉంటానని చెబుతున్నది నిజమే అయితే రాజకీయంగా ఒక గట్టి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వచ్చేసింది.మరో మూడేళ్ళల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం నిజమే అయితే పవన్ ఇప్పటి నుండే జాగ్రత్తగా పావులు కదపటం చాలా అవసరం.

అదీ కాకుండా నిత్యం ప్రజల్లో తిరుగుతూ, ప్రధాన సమస్యల మీద గొంతెత్తుతూ ముందుకు వెళ్తే తప్ప పవన్ అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube