ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన శివగామి

తెలుగు బిగ్ బాస్ చాలా రొటీన్ గా, బోరింగ్ గా సాగుతున్న ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ రెండు రోజుల పాటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసింది.నాగార్జున కంటే కూడా అధికంగా రమ్య కృష్ణ ఆకట్టుకుంటుందంటూ టాక్ వచ్చింది.

 Telugu Bigboss No Eliminationin This Week 1tstop-TeluguStop.com

నాగ్ దయచేసి మరో కొన్ని రోజులు అక్కడే ఉండాలని బిగ్ బాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.శివగామి గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన రమ్య తన మాట శాశనం అన్నట్లుగా హోస్టింగ్ చేసింది.

Telugu Mahesh, Punarnavi, Ramya Krishna, Sivagami, Telugu Big Boss-

ఇంటి సభ్యలతో ఆమె ఆడిన ఆటలు, పాడిన పాటలు, చేసిన సందడి అంతా ఇంతా కాదు.సౌత్ లో మొదటి సారి బిగ్ బాస్ కు హోస్ట్ చేసిన ఘనత ఈమెకు దక్కింది.ప్రతి మూమెంట్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈమె హోస్టింగ్ ఉండనడంలో ఎలాంటి అనుమానం అయితే లేదు.మొదటి రోజు రాయల్ లుక్ లో వచ్చిన రమ్య కృష్ణ రెండవ రోజు మోడ్రన్ లుక్ లో వచ్చింది.

Telugu Mahesh, Punarnavi, Ramya Krishna, Sivagami, Telugu Big Boss-

ఇక ఇంటి సభ్యులను సర్ఫరైజ్ చేస్తూ ఇంట్లోకి వెళ్లిన ఈ అమ్మడు అక్కడ చేసిన హంగామా మరింత ఆకర్షణీయంగా ఉంది.ఇంత సందడి జరుగుతున్నా ఎలిమినేషన్ లో ఉన్న మహేష్ విత్త, పునర్నవి, హిమజలు మాత్రం చాలా టెన్షన్ గా ఉన్నారు.వారి ముగ్గురిలో ఎవరు ఎలిమినెట్ అవుతారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.కానీ షాకింగా ఈ వారం ఎలిమినేషన్ లేదని చెప్పి నామినేషన్స్ లో ఉన్న వారికి స్వీట్ షాక్ ఇచ్చింది.

ఈ వారం వైల్ కార్డు ఎంట్రీ ద్వారా శిల్ప చక్రవర్తి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube