తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న పాక్,ప్రధాని కార్యాలయానికే కరెంట్ కట్!

పొరుగుదేశం పాకిస్థాన్ ఎంత తీవ్ర స్థాయిలో ఆర్ధిక సంక్షోభం ఎదురుకొంటున్న విషయం తెలిసిందే.అయితే ఈ ఆర్ధిక సంక్షోభం ఎంతవరకు చేరుకుంది అంటే ఏకంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆఫీస్ కే కరెంట్ నిలిపివేసేంతగా.

 Pm Imran Khans Office Faces Power Cut Over Non Payment Of Bills 1-TeluguStop.com

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజంగా విద్యుత్ బిలులు చెల్లించలేదన్నకారణంగా ఇమ్రాన్ ఖాన్ ఆఫీస్ కు కరెంట్ నిలిపివేసినట్లు తెలుస్తుంది.ఒకపక్క దేశంలో తీవ్ర స్థాయిలో ఆర్ధిక సంక్షోభం ఎదురుకొంటున్న పాక్ మరోపక్క భారత్ కు అక్టోబర్ లేదా నవంబర్ లో యుద్దానికి సై అంటూ తెగ తొడకొడుతుంది.

విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న కారణంతో ప్రధాని కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ హెచ్చరించింది.గతంలో కూడా పలుసార్లు హెచ్చరించినా ఈ బకాయిల పై ఎలాంటి స్పందన రాకపోవడం తో ప్రధాని కార్యాలయానికి కరెంట్ ను కట్ చేసారు అధికారులు.దాదాపు రూ.41 లక్షల విద్యుత్ బిల్లు బకాయిపడినట్లు తెలుస్తుంది.వారి నిర్లక్ష్యం కారణంగా.విద్యుత్ ఉత్పత్తిచేస్తున్న ప్రైవేటు సంస్థలకు తాము బిల్లులు చెల్లించలేకపోతున్నట్టు ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ పేర్కొంది.

ఇక తాము వేచిచూడలేమని.ప్రధాని కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని నోటీసులిచ్చారు.

ఇలా ఒకపక్క ఆర్ధిక సంక్షోభం తో మరోపక్క విద్యుత్ కొరత తో తెగ ఇబ్బందులు పడుతున్న పాక్ పక్క దేశానికి మాత్రం యుద్ధం చేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తుండడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube