వైఎస్ చౌదరి దూకుడికి బీజేపీ బ్రేక్ వేసిందా ?

బీజేపీ ఏపీలో ఈ మధ్య బాగా బలపడుతున్నట్టే కనిపిస్తున్నా అంతర్గతంగా ఆ పార్టీలో వర్గాలుగా నాయకులు విడిపోయారు.ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును సమర్ధించేవారు, విమర్శించేవారు ఇలా రెండుగా నాయకులు విడిపోయినట్టుగా కనిపిస్తోంది.

 Bjpbreaksonsujana Chowdaryspeed-TeluguStop.com

టీడీపీలో చంద్రబాబు కి అత్యంత సన్నిహితులుగా ఉన్న నాయకులు ఇటీవల బీజేపీలో చేరిపోవడంతో ఈ వర్గ పోరు తెర మీదకు వచ్చింది.వారు బీజేపీలోకి వెళ్లినా చంద్రబాబు ప్రయోజనాలకు అనుగుణంగానే ఏపీలో రాజకీయాలు చేయడం, సవాళ్లు చేయడం వంటి విషయాలు అధిష్టానం వరకు చేరాయి.

ముఖ్యంగా ఏపీ రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ అగ్ర నాయకత్వం వైకిరి ఎలా ఉందో పూర్తిగా తెలుసుకోకుండానే ఆ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఈ విషయంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి దూకుడుగా ఉండడం చంద్రబాబు ప్రయోజనం కోసమే అనే అనుమానాలను బీజేపీ అధిష్టానం గ్రహించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Amaravathi, Andhrapradesh, Bjpbreaks, Sommu Verraju, Ujana Chowdary, Ysja

క్రమశిక్షణ అని చెప్పుకునే బిజెపి లో కొత్తగా వచ్చినవారు దూకుడు మాములుగా లేదు.పార్టీ విధానాలు ఎలా వున్నా టిడిపి విధానాలే తమ పార్టీ అజెండాగా వారు దూసుకుపోతున్నారనే విమర్శలు గమనించిన అధిష్టానం నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది.దీనిలో భాగంగానే బిజెపి సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యుడు అధికారప్రతినిధి జివిఎల్ నరసింహారావు, ఎమ్యెల్సీ సోము వీర్రాజు లకు ఏం చేయాలో అధిష్టానం నిర్దేశించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.దాంతో వారు టిడిపికి లబ్ది చేకూరే తమ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు చెక్ పెట్టె విధంగా మాట్లాడుతున్నారు.

అందుకే అమరావతి లో జరిగిన బాగోతాన్ని తక్షణం బయటపెట్టాలన్ డిమాండ్ తెరపైకి తెచ్చారు.రాజధాని మార్పు అంశం అనేది పూరేతిగా వైసిపి సర్కార్ నిర్ణయమని తేల్చేశారు.

చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే రాజధాని మార్పు ఆలోచనే వచ్చేది కాదన్న ఘాటు వ్యాఖ్యలు చేయడంతో బాటు కేంద్రం ఈ విషయంలో సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ చెప్పినంత స్థాయిలో సీరియస్ గా తీసుకోవడం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

Telugu Amaravathi, Andhrapradesh, Bjpbreaks, Sommu Verraju, Ujana Chowdary, Ysja

రాజధాని వ్యవహారం రోజు రోజుకు ముదురుతుండడంతో ఇంటలిజెన్స్ విభాగం కూడా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు జరుగుతున్న తాజా విషయాలను ప్రభుత్వానికి చేరవేస్తుంది.ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందుతుంది.సర్కార్ అమరావతిపై ఇచ్చే ప్రకటన వరకు ఆగాలని ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని వీరంతా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా వైసిపి అమరావతి అభివృద్ధిపై ఆసక్తి చూపడం లేదన్న క్లారిటీ ని జివిఎల్ ఇవ్వడంతో ఇప్పుడు రాజధాని వాతావరణం మరింత వేడిగా మారింది.సుజనా చౌదరి ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్లకుండా బీజేపీ అధిష్టానం కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా స్థానిక పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ కు బీజేపీ పూర్తిగా సపోర్ట్ చేసే ఆలోచనలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube