ఏఐసిసి ప్రెసిడెంట్ ఎవరో ఫైనల్ అయ్యేది రేపే! అందరి చూపు అతనివైపే

జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది.అధ్యక్షుడు లేని పార్టీలో నాయకులు కూడా ఎవరికీ వారు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

 Mukul Wasnik Ahead In Race For Congress President-TeluguStop.com

రాహుల్ గాంధీ బాద్యతల నుంచి తప్పుకున్న తర్వాత సీనియర్ నేతలకి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని భావించిన ఎవరు ముందుకి రాలేదు.ఇక ప్రియాంకా గాంధీకి అప్పగించే ప్రయత్నం చేసిన ఆమె కూడా నావల్ల కాదని చేతులెత్తేసింది.

ఇదిలా ఉంటే పార్టీకి దిశా నిర్దేశ్యం చేసీ అధ్యక్షుడు లేకపోవడంతో నాయకులు అందరూ తాజాగా ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎవరికి వారుగా వాఖ్యలు చేసారు.పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేయలేదు.

ఇదిలా ఉంటే ఫైనల్ గా పార్టీ అధ్యక్షుడుని ఎంపిక చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది.ఇలాగే ఉంటే ఇంకా పార్టీ మనుగడకే ప్రమాదం అని భావించి తక్షణం అధ్యకుడుగా గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉండే నేతని ఎన్నుకోవాలని భావించిన సోనియా గాంధీ చివరికి తనకి అత్యంత విధేయుడైన మహారాష్ట్రకు చెందిన ముకుల్ వాస్నిక్‌కు గురుతర బాధ్యతలు అప్పజెప్పాలని దాదాపు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని సరిచేయాలంటే ఆయనకే సాధ్యమని సోనియా భావించారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ముకుల్ వాస్నిక్ పీవీ నరసింహా రావు హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అలాగే 2009 లో రాంటేక్ నియోజకవర్గం నుంచి గెలుపొంది మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.ఈ నేపధ్యంలో అతనికి పార్టీ సారధ్య బాద్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

దీనికి శనివారం ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube