కాశ్మీర్ కోసం మళ్ళీ కాలు దువ్వుతున్న పాకిస్తాన్! మూల్యం చెల్లించుకోక తప్పదా

ఓ వైపు భారత్ లోకి ఉగ్రవాదులని పంపిస్తూ భారత్ మూలాలు దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ అక్కడ ఇష్టానుసారంగా ఉగ్రవాదులని పెంచి పోషిస్తుంది.మరో వైపు కాశ్మీర్ లో శాంతి స్థాపన అంటూ నీతి వాఖ్యలు మాట్లాడుతుంది.

 Imrankhan Warnsrevoking Article370 Could Sparkindia Pakistanwar 1-TeluguStop.com

ఎప్పుడు కూడా కాశ్మీర్ ని పాకిస్తాన్ లో ఎలా అయిన కలిపెసుకోవాలని ప్రయత్నం చేసే భారత్ కి ఇక్కడి రాజకీయ పార్టీల సహాయ సహకారాల కారణంగా దేశం మధ్యలోనే ఉగ్రవాద దాడులకి తెరతీసి దేశాన్ని విచ్చిన్నం చేసి తరువాత కాశ్మీర్ ని వదిలేసుకోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చేలా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

అయితే మోడీ అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ కుయుక్తులు, కవ్వింపులకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి వారిని మెల్లగా నియంత్రించే ప్రయత్నం చేస్తూ వచ్చారు.

ఈ నేపధ్యంలో ఉగ్రవాదులు సరిహద్దు దాటి రాకుండా కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేసారు.ఇక పనిలో పనిగా స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న కాశ్మీర్ లో కొంత మంది స్వార్ధ వేర్పాటు వాదుల కారణంగానే ఉగ్రవాదం పెరుగుతుందని గ్రహించి ఆ కాశ్మీర్ కి ఉన్న ఆ స్వయం ప్రతిపత్తిని రాదు చేస్తే అప్పుడు దేశాన్ని ఏకం చేయడంతో పాటు పాకిస్తాన్ ఆటలకి చరమగీతం పాడినట్లు అవుతుందని భావించి సంచలన నిర్ణయం తీసుకని ఆర్టికల్ 370, 35ఏ ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దీంతో కాశ్మీర్ పై తమ పట్టు కోల్పోతున్నామని గ్రహించిన పాకిస్తాన్ భారత్ పై యుద్ధానికి రంకెలు వేస్తుంది.అక్కడ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న విపక్షాల ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతుంది.

అయితే ఏ మాత్రం పాకిస్తాన్ అదుపు తప్పిన భారత్ నుంచి గట్టి దెబ్బ ఎదుర్కొని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube