గెలుపు నాదే, అధ్యక్షుడు నేనే..ట్రంప్ ధీమా...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.తన కి ఎలాంటి పోటీ ఉన్నా సరే గెలుపు తనదే అంటున్నారు.

 Donald Trump Sensationalcomments 1-TeluguStop.com

డెమోక్రటిక్ పార్టీ పై ఎంతో వ్యూహాత్మకంగా కామెంట్స్ చేస్తూ తన గెలుపుకి మార్గం సుగమం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ ఇటీవల కాలంలో చైనా, ఇరాన్ లపై ఆంక్షలు విధించిన విషయం విధితమే, అదే సమయంలో ఈ రెండు దేశాలపై సదాభిప్రాయం లేకుండా చేయడానికి అమెరికా ప్రజల ముందు ఈ ఇరు దేశాలు మన దేశాన్ని ధిక్కరిస్తున్నాయి అనే భావన కలుగ చేశాడు.తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఇదే అంశాన్ని పావుగా వాడుకుంటున్నాడు ట్రంప్.

ఎలా అంటే.

అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇరాన్,చైనా దేశాలు భావిస్తున్నాయని ఆరోపించారు.

గత సంవత్సరం ఐరాసాలో ట్రంప్ ప్రసంగించినప్పుడు కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు.అధ్యక్షుడిగా తాను మరో మారు అధికార భాద్యతలు చేపట్టడం ఆ రెండు దేశాలకి ఇష్టం లేదని అంటూనే డెమోక్రటిక్ పార్టీ ,చైనా, ఇరాన్ ఆలోచనలు ఒక్కటే అనే విధంగా ప్రచారం చేస్తున్నాడు.

ఈ విధంగా చేయడం వలన ఆ రెండు దేశాలపై ఉన్న వ్యతిరేకత డెమొక్రటిక్ పార్టీ పై కూడా ప్రజలు చూపిస్తారనేది ట్రంప్ ఎత్తుగడగా విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube