జగన్ ఆ పోలీసులపై ప్రతీకారం తీర్చుకున్నట్లేనా  

Ap Cm Jagan Revenge On Vizag Police Officers Now -

రెండున్నరేళ్ల కింద వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా అడ్డుకున్న పోలీసుల మీద జగన్ ప్రతీకారం తీర్చుకున్నారు అనే టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఎయిర్ పోర్ట్ లో జగన్ సిటీలోకి రాకుండా అడ్డుకున్న వీఆర్‌ కు సరండర్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Ap Cm Jagan Revenge On Vizag Police Officers Now

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో 2017 జనవరి 26న విశాఖ బీచ్‌రోడ్డులో వైసీపీ నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ ప్రకటించారు.గణతంత్ర వేడుకల రోజున బీచ్‌రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన నగర పోలీసులు ఎయిర్ పోర్ట్ లోనే జగన్ ని అడ్డుకున్నారు.

అప్పట్లో ఆయన్ను అడ్డుకున్న పోలీసులకి అప్పుడే జగన్ వార్నింగ్ ఇచ్చారు.రెండేళ్ళ తర్వాత తాను అధికారంలోకి రాగానే మీకు చేయాల్సిన సత్కారం కచ్చితంగా చేస్తా అని వార్నింగ్ ఇచ్చారు.

జగన్ ఆ పోలీసులపై ప్రతీకారం తీర్చుకున్నట్లేనా-Telugu Political News-Telugu Tollywood Photo Image

ఇప్పుడు అలా చెప్పిన విధంగానే విశాఖలో అడ్డుకున్న పోలీసు అధికారులందరినీ వీఆర్‌కు సరెండర్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.దీనిప్రకారం నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఎస్సైలు, ఒక ఏఎస్సైని వీఆర్‌కు పంపుతూ జూలై 27న పోలీసు కమిషనర్‌ ఆదేశాలు జారీచేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రం బయటకు రాలేదు.అలాగే ఆ ఘటన జరిగినప్పుడు నగరంలో విశాఖ రేంజ్‌ పరిధిలో పనిచేస్తున్న మరికొంతమంది అధికారులను కూడా వీఆర్‌కు పంపినట్లు పోలీస్ వర్గాలలో వినిపిస్తుంది.