రష్మిక పాత్ర చూసి డియర్ కామ్రేడ్ కి కనెక్ట్ అయిన కరణ్ జోహార్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్ము దర్శకత్వంలో తెరకెక్కి తాజాగా థియేటర్ లోకి వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్.ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకొని విజయ్ దేవరకొండ కెరియర్ లో మరో ఫ్లాప్ సినిమాగా చేరింది.

 Karan Johar Bought Rights Of Vijay Deverakondas Dear Comrade-TeluguStop.com

అయితే విజయ్ క్రేజ్ కారణంగా తెలుగులో సినిమాని కొన్న బయ్యర్లు కొంత సేఫ్ అయ్యారని తెలుస్తుంది.నిర్మాతలు కూడా సినిమాతో భారీ లాభాలు రాబట్టుకోలేకపోయిన నష్టం అయితే రాలేదని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే రిలీజ్ కి ముందే డియర్ కామ్రేడ్ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాను అని బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించడం సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే రిలీజ్ తర్వాత ఈ సినిమా చూసిన అందరూ కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనడానికి అసలు ఇందులో అంత గొప్పగా చెప్పుకునే పాయింట్ ఏముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త ప్రకారం ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనడం వెనుక కరణ్ జోహార్ కి ఇందులో రష్మిక పోషించిన లేడీ క్రికెటర్ పాత్ర భాగా కనెక్ట్ కావడమే అని సమాచారం.ఓ మహిళ క్రికెటర్ గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న లైంగిక వేదింపులు అనే పాయింట్ కరణ్ కి భాగా నచ్చడంతో దానిని బాలీవుడ్ కి తగ్గట్లు కథ, కథనాలు మార్చేసి లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కరణ్ అఫీషియల్ లో సినిమా రీమేక్ ని ఎనౌన్స్ చేసి స్టార్ట్ చేసేంత వరకు వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube