ట్రంప్ బృందం నుంచీ మరో అధికారి ఔట్..!!!

అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి.ట్రంప్ బృందంలో ఉన్న అత్యంత కీలక వ్యక్తులు ట్రంప్ ని విడిచి వెళ్ళడంతో ట్రంప్ తీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

 America Topintelligence Officer Doncoatsreigns-TeluguStop.com

ఆయా అధికారుల తీరు సరిగా లేదని ట్రంప్ చెప్పుకొస్తున్నా, ట్రంప్ వివపరీత చర్యల కారణంగానే వారు వారి పదవులని విడిచి వెళ్తున్నారని తెలుస్తోంది.గతంలో ఎంతో మంది సీనియర్ అధికారులు ట్రంప్ కోటరీ నుంచీ బయటకి వచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

ట్రంప్ బృందం నుంచీ మరో అధికార

తాజాగా ట్రంప్ బృందంలో అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న ఉన్నత అధికారి తప్పుకున్నారు.జాతీయ నిఘా విభాగం డైరక్టర్ గా ఉన్న డాన్ కోట్స్ ఆయన పదవి నుంచీ తప్పుకోవడం సంచలన సృష్టించింది.డాన్ కోట్స్ త్వరలో తప్పుకుంటారని ఆయన స్థానంలో టెక్సాస్ కి చెందిన కాంగ్రెస్ సభ్యుడు జాన్ రాట్‌క్లిఫ్‌ ని తాను నామినేట్ చేస్తున్నట్టుగా ట్రంప్ తెలిపారు.

త్వరలో జాన్ విదులకి హాజరవుతారని ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అయితే డాన్ కోట్స్ తప్పుకోవడానికి ప్రధాన కారణం రష్యా ,ఉత్తర కొరియా అంశాలే నని ఈ విషయాలలో ఇద్దరి మధ్య తరచూ విభేదాలు వచ్చేవని తెలుస్తోంది.ప్రస్తుతం కోట్స్ సీఐఏ, ఎన్‌ఎస్‌ఏ, లతో పాటు సుమారు 17 అమెరికా నిఘా సంస్థల భాద్యతలని చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube