సైరా సందడిని విభిన్నంగా మొదలు పెట్టబోతున్నారు

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయ్యింది.

 Sairanarasimha Reddyvideo Makeing Releasesoon-TeluguStop.com

ఇటీవలే రీ రికార్డింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది.డబ్బింగ్‌ కూడా మరో వైపు జరుగుతుంది.

విడుదలకు మరో రెండు నెలల సమయం ఉంది.ఈ సమయంలో ఈ చిత్రం ప్రమోషన్‌ను మొదలు పెట్టాలని నిర్ణయించారు.

అందుకోసం మొదటి నెల రోజులు మేకింగ్‌ వీడియోలు మరియు ఫొటోలతో సోషల్‌ మీడియాలో సందడి చేయాలని భావిస్తున్నారు.

సైరా సందడిని విభిన్నంగా మొదల

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లో ‘సైరా’ చిత్రం మేకింగ్‌ వీడియో రాబోతుంది.చిత్రం కోసం ఎంత కష్టపడ్డారు.ఎంత మంది ఈ చిత్రం కోసం కష్టపడ్డారు అనేది మేకింగ్‌ వీడియోలో చూపించి ఆసక్తి పెంచబోతున్నారు.

రెండేళ్ల సమయం ఎందుకు ఈ చిత్రం తీసుకుందనే విషయాన్ని కూడా ఈ మేకింగ్‌ వీడియోల్లో చూపించబోతున్నారు.ఇక ఆగస్టు 15వ తారీకున టీజర్‌ను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ మరియు తమిళంలో కూడా ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు.అక్కడ ఈ చిత్రం ప్రమోషన్స్‌ చాలా ప్రత్యేకంగా చేయబోతున్నారు.

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ చిత్రం డబ్బింగ్‌ రైట్స్‌ను దక్కించుకుంది.అక్కడ డబ్బింగ్‌ చెప్పించే పనిలో ఉంది.

తప్పకుండా బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం అమితాబ్‌ కారణంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.చిరంజీవి కెరీర్‌లోనే ఇదో మైలు రాయి చిత్రంగా నిలవబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube