ట్రిపుల్ తలాక్ బిల్లుకి కేంద్రం ఆమోదం!

గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన అంశం ట్రిపుల్ తలాక్.ముస్లిం మహిళల హక్కులకి భంగం కలిగించే విధంగా కేవలం మూడు సార్లు తలాక్ అనే మాట చెబితే వారితో విడాకులు అయిపోయినట్లే అనే చెబుతున్న షరియా చట్టాలలో మార్పు చేయాల్సిన అవసరం ఉందని ముస్లిం మహిళలు రోడ్డెక్కారు.

 Lok Sabha Passes Triple Talaq Bill Criminalising Instant Divorce-TeluguStop.com

దీనికి మహిళా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.దీంతో ఈ వ్యవహారం కాస్తా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దీనిపై గతంలో బీజేపీ పార్టీ తాము అధికారంలోకి రాగానే ట్రిపుల్ తలాక్ ని రద్దు చేస్తామని ప్రకటించింది.అయితే బీజేపీ ఇచ్చిన హామీ మీద ముస్లిం సంఘాలు అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసాయి.

తన మత కట్టుబాట్లు లోకి ఎవరు వచ్చిన ఒప్పుకోమని చెప్పుకొచ్చారు.

అయితే ఆ ట్రిపుల్ తలాక్ రద్దుపై బీజేపీ గట్టి పట్టుదలతో ఉడటంతో లోక సభలో ఇప్పటికే దానిని ప్రవేశ పెట్టింది.

ప్రస్తుతం బీజేపీ బలం ఎక్కువగా ఉండటం దానిని ఆమోదం చేయించడం పెద్ద కష్టమైన విషయం కాదు.ఈ నేపధ్యంలో తాజాగా ఊహించిన విధంగానే ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

దీనిపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది.బిల్లుపై ఓటింగ్‌కు ముందు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీ అయిన జేడీయూ కూడా బిల్లుకి వ్యతిరేకంగా వాకౌట్ చేశాయి.

ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్ లో ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 303 ఓట్లు పడ్డాయి.వ్యతిరేకంగా 82 ఓట్లు పడ్డాయి.

ట్రిపుల్ తలాక్ బిల్లు అనేది మతానికి సంబంధించిన అంశం కాదని మహిళల హక్కులకి సంబంధించిన విషయమని బీజేపీ నేతలు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube