చిన్న బడ్జెట్ లో సినిమాలను నిర్మించి మంచి లాభాలను అందుకోవాలని ఏ దర్శకుడికి ఉండదు.అలాంటి లిస్ట్ సౌత్ ఇండస్ట్రీలో పెద్దగానే ఉంది.
మినిమామ్ లాభాలను అందుకోవాలని దర్శకుడు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తాడు.అయితే తారల రెమ్యునరేషన్ లలో మాత్రం వాళ్ళకి భారం తప్పడం లేదు.
హారర్ కాన్సెప్ట్ తో వరుసగా లాభాలను అందుకున్న దర్శకుడు ఓంకార్ నెక్స్ట్ మళ్ళీ రాజుగారి గది కాన్సెప్ట్ తోనే రాబోతున్నాడు.అయితే మొదట రాజుగారి గది 3 కోసం తమన్నా ని బ్రతిమాలి ఓ ధరకు ఫిక్స్ చేసుకోగా ఎందుకోగాని ఆమె మొదట్లోనే వెళ్ళిపోయింది.ఇక తరువాత ఆ పాత్ర కోసం రకరకాల హీరోయిన్స్ ని కలిసిన ఓంకార్ ఫైనల్ గా కాజల్ నే ఎలాగోలా ఒప్పించాలని అనుకున్నాడు.
కానీ అమ్మడు రెమ్యునరేషన్ తో గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.సీత డిజాస్టర్ అయిన తరువాత కూడా ముందు తీసుకున్న దానికంటే డబుల్ రేట్ చెప్పిందట.దీంతో దర్శకుడు బయపడిపోయి మనసు మార్చుకున్నట్లు టాక్.
సినిమా కోసం సెట్ చేసుకున్న బడ్జెట్ లో సెట్టయ్యే మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ కోసం సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం.