లోకేష్ మాటలు తక్కువ... కామెంట్స్ ఎక్కువ! ట్విట్టర్ పులి  

Netizens Troll On Nara Lokesh Twitter Comments -

ఏపీ రాజకీయాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారసుడుగా రాజకీయ అరంగేట్రం ఇచ్చి ఎన్నికలలో గెలవకుండానే ఎమ్మెల్సీ అయిపోయి, ఆపై మంత్రి అయిపోయి తన ప్రత్యేకత చాటుకున్న నారా లోకేష్ రాజకీయ జీవితంలో పొగడ్తల కంటే విమర్శలే ఎక్కువగా ఉన్నాయి.తెలుగు స్పష్టంగా మాట్లాడలేక, అలాగే ఏ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతూ రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ ప్రభావం కారణంగానే టీడీపీ పార్టీ తాజా ఎన్నికలలో కొంత నేగిటివిటీ సొంతం చేసుకొని ఎన్నికలలో భారీగా ఓడిపోవడానికి కారణం అయ్యింది అనేది రాజకీయ విశ్లేషకుల మాట.

Netizens Troll On Nara Lokesh Twitter Comments

ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత మీడియాకి పూర్తిగా దూరంగా ఉంటున్న లోకేష్ ఎక్కడ తన మాటలని నేరుగా వినిపించే ప్రయత్నం చేయలేదు.తనలో అసమర్ధతని తాజా ఎన్నికలు చూపించడంతో ఇప్పుడు దానిని మెరుగు పరుచుకునే ప్రయత్నంలో ఎలక్ట్రానిక్ మీడియాకి దూరంగా ఉన్నారు.

అయితే ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు అధికార పక్షం మీద విమర్శలు చేస్తున్నాడు.దీంతో ఇప్పుడు లోకేష్ ట్విట్టర్ పులిగా మారిపోయాడు అని విపక్షాల నుంచి, యాంటీ ఫాన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

లోకేష్ మాటలు తక్కువ… కామెంట్స్ ఎక్కువ ట్విట్టర్ పులి-Telugu Political News-Telugu Tollywood Photo Image

త్వరలో లోకేష్ ట్విట్టర్ టీవీ స్టార్ట్ చేయబోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.బయట మీడియా ముందు మాట్లాడితే ఎక్కడ తప్పులు మాట్లాడుతానో అని భయపడి ఇలా ట్విట్టర్ లో కామెంట్స్ చేయడం ఈజీ కాబట్టి చీటికి, మాటికి కామెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

ఇక టీడీపీ అనుకూల మీడియా లోకేష్ ట్విట్టర్ కామెంట్స్ చాలా పెద్ద విమర్శలుగా ప్రాజెక్ట్ చేసి అతనిని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.