పార్టీపై పట్టు కోల్పోతున్న చంద్రబాబు! ఇది రాజీనామా చేస్తున్న మాజీల మాట

ఏపీ రాజకీయాలలో టీడీపీ ప్రస్తానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కాంగ్రెస్ తర్వాత, ఏపీని ఎక్కువ కాలం పరిపాలించింది టీడీపీ, అలాగే కేవలం టీడీపీ పార్టీ నుంచి మాత్రమే ఎక్కువ కాలం ఒకే వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఏపీలో పని చేసారు.

 Tdp Leadersopen Commentson Nara Lokesh-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ ఏపీని ఎక్కువ కాలం పరిపాలించిన నాయకులలో ఆధిపత్యం కారణంగా ఎక్కువ మంది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రులు మారిపోతూ వచ్చారు.ఇక తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంకి కూడా నిలకడ వచ్చింది.

ఓ విధంగా ఏపీ రాజకీయాలలో టీడీపీది తిరుగులేని ప్రస్తానం.

అయితే ఇప్పుడు ఆ పార్టీ సంధి కాలంలో ఉంది.

ఇంత కాలం పార్టీకి వెన్నెముకగా నిలబడి నడిపించిన చంద్రబాబు చేతులలో నుంచి పార్టీ మెల్లగా జారిపోతుందని ఆ పార్టీ నుంచి బయటకి వస్తున్న నేతల మాట.పార్టీ మీద పెత్తనం చెలాయిస్తూ నాయకత్వ లక్షణాలు లేకపోయినా పార్టీని తన గుప్పిట్లోకి తీసుకోవాలని భావిస్తున్న చంద్రబాబు తనయుడు లోకేష్ కారణంగా పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు.ఇప్పుడు టీడీపీ నిర్ణయాలు అన్ని చంద్రబాబు ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయని చాలా మంది చెబుతున్నారు.లోకేష్ వెనకుండి గ్రూపులు నడుపుతూ సీనియర్ నాయకులకి గౌరవం ఇవ్వకుండా తన సొంత క్యాడర్ పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ కారణంగానే పార్టీలో ఇమడలేక బయటకి వచ్చేస్తున్నామని చాలా మంది నేతలు చెబుతున్నారు.ఇక టీడీపీని ఎవరు కాపాదలేరని తేల్చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube