ఓఎన్జీసి పైప్ లైన్ నుంచి లీకైన గ్యాస్... భయంతో పరుగులు పెట్టిన జనం

కోనసీమలో కేజీ బేసిన్ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ ఘటనలు ఎప్పుడు ప్రజలని భయపెడుతూ ఉంటాయి.గతంలో గ్యాస్ లీకై కొంత మంది ప్రజలు కూడా చనిపోయిన ఘటనలు జరిగాయి ఈ నేపధ్యంలో.

 Ongc Gas Leak In West Godavari District-TeluguStop.com

గ్యాస్ లీకైతే సమీప గ్రామస్తులు తీవ్ర భయ భ్రాంతులకి గురవుతారు.తాజాగా మరో సారి అలాంటి ఘటన కోనసీమలో ప్రజలని భయపెట్టింది.

గెయిల్ గ్యాస్ పైపు లైన్ పగిలి లీకేజ్ కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.గ్యాస్ పైప్ లైన్ తరుచుగా లీకేజ్ లు కావడం ఏదో నామ మాత్రంగా మరమ్మత్తులు చేసి వదిలేయడం తరుచు అలవాటుగా మారిపోయింది.

నెల రోజుల వ్యవధిలో గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం.

సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలోని మోరి జిసిఎస్‌ పరిధిలో ఒఎన్‌జిసి గ్యాస్‌ పైప్‌లైన్‌ నుంచి క్రూడాయిల్‌తో గ్యాస్‌ లీకైంది.

క్రుడాయిల్ తో పాటు గ్యాస్ వాయువు లీకేజి కావడంతో స్థానిక ప్రజలు భయాందోళనలు గురయ్యారు.గ్యాస్ పైపు లైన్ వెల్ నుండి పొగలా ఆ ప్రాంతమంతా వ్యాపించేయడంతో స్థానికులు భయభ్రాంతులకి గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే 100 కి కాల్ చేసినా సంఘటన స్థలంకు ఒఎన్జీసి అధికారులు రాకపోవడంతో స్థానికులు తాటిపాక జిసిఎస్ కు సమాచారం ఇచ్చారు.ఒఎన్జీసి సిబ్బంది ఇంకా లీకేజ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube