ప్రమాద వశాత్తు చేపను మింగాడు,ఏమైందంటే

ప్రమాదం అంటేనే చెప్పి రాదు అని అంటారు.ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కూడా.

 Man Dies After Accidently Swallowing Live Tilapia Fish In Philippines-TeluguStop.com

గతంలో జంతువుల ఛానల్ లో జంతువుల గురించి విశ్లేషించే ఒక వ్యక్తి ఒక చేప కారణంగా మృతి చెందిన ఘటన గుర్తు ఉండే ఉంటుంది.ఆయన ఆ ఛానల్ లో భాగముగా పాములతోనే మెలిగేవ్యక్తి ఒక చేప కారణంగా మృతి చెందాడు.అయితే ఇప్పుడు ఫిలిప్పీన్స్ నదిలో చేపలు పడుతూ ఒక వ్యక్తి అనుకోని ప్రమాదం లో మరణించాడు.50 సంవత్సరాల ఆ వ్యక్తికి చేపలు పట్టడమే జీవనాధారం, అందుకే ఆ చేపల వేటలో కూడా అతడు ఎప్పుడూ పాల్గొంటూ ఉంటాడు.అయితే వేటలో భాగంగా చేపను పట్టిన వెంటనే తన దంతాలతో నొక్కి పట్టుకోవడం అలవాటు.అయితే అతనికి ఉన్న ఆ అలవాటే చివరికి అతడి ప్రాణాన్ని తీసింది.

ప్రమాద వశాత్తు చేపను మింగాడు,

దంతాల మధ్య ఉంచుకున్న టిలాపియా రకం చేపను ప్రమాదవశాత్తు మింగడంతో శ్వాసరంధ్రాలు మూసుకుపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.అయితే వెంటనే అతడిని స్థానికులు గుర్తించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ అ‍ప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.కేవలం అతడికి ఉన్న అలవాటు లో పొరపాటు చోటుచేసుకోవడం తో అతడు తన ప్రాణాలను కూడా పోగొట్టుకోవలసి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube