కొత్త ఆవిష్కరణ : ఇది పెట్టుకుంటే పిల్లలు పుట్టే అవకాశమే లేదు, కండోమ్స్‌ పిల్స్‌ అవసరమే లేదు

కొత్తగా పెళ్లి అయిన వారు వెంటనే పిల్లలు వద్దు అనుకుంటూ ఉంటారు.ఇక ఒక పాప లేదా బాబు పుట్టిన వారు కాస్త గ్యాప్‌ తీసుకుని సెకండ్‌ ప్లాన్‌ చేసుకోవాలనుకుంటారు.

 Next Method Of Birth Control With Contraceptive Jewellery-TeluguStop.com

వెంటనే గర్బం వద్దు అనుకునే వారు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.కొందరు కండోమ్స్‌ వాడుతూ ఉంటే మరి కొందరు పిల్స్‌ వాడుతూ ఉంటారు.

మరి కొందరు ఇంకో రకంగా కూడా పిల్లలను వద్దనుకుంటూ ఉంటారు.అయితే ప్రస్తుతం ఉన్న మూస పద్దతులు కాకుండా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఒక కొత్త పరికరం వచ్చింది.

అది ఒక ఉంగరం ఆకారంలో ఉంటుంది.దీన్ని ఇప్పటి వరకు జంతువుల పై ప్రయోగించారు.

కొత్త ఆవిష్కరణ : ఇది పెట్టుకుం

జంతువులపై ప్రయోగించిన సమయంలో సక్సెస్‌ అయ్యింది.మనుషులపై ప్రయోగించేందుకు మరి కొన్ని రోజులు కావాలంటున్నారు.ఇంతకు ఈ పరికరం ఎలా పని చేస్తుంటే.దీనిని శరీరంకు తాకుతూ ఉండేలా ఉంగరంగా గాని వాచ్‌లో కాని ధరించాలి.దీనికి మహిళలు ధరించిన సమయంలో వారిలో అండాల ఉత్పత్తి ఆగిపోయేలా హార్మోన్‌లను బయట నుండి లోనికి పంపిస్తుంది.ఇక అబ్బాయిలు దీన్ని వాడితే శుక్రకణాల బలహీనంగా అయ్యేలా హార్మోన్‌లను పంపిస్తుంది.

కొత్త ఆవిష్కరణ : ఇది పెట్టుకుం

ఎప్పుడైతే పిల్లలు కావాలనుకుంటారో అప్పుడు ఈ పరికరం తీసేసి శృంగారంలో పాల్గొన్నట్లయితే యధావిధిగా పిల్లలు కలుగుతారని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఈ ప్రయోగంలో పార్టిసిపెంట్‌ చేసేందుకు పురుషులు మరియు స్త్రీలు కూడా సిద్దంగా ఉన్నారు.ప్రస్తుతం వారి ఆరోగ్య విషయమై పరిశోదన జరుగుతుంది.కొన్ని నెలల్లో వారిపై దీన్ని ప్రయోగించి కొన్ని నెలల వరకు ప్రయోగం కొనసాగిస్తారు.ఈ సమయంలో వారి అండాలు మరియు శుక్రకణాలను పరిశీలించబోతున్నారు.ఇది సక్సెస్‌ అయితే చాలా ఉపయోగాలు ఉంటాయి.

అయితే ఇది సామాన్యుల వరకు వచ్చేందుకు ఇంకో పదేళ్లయినా పట్టే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube