'ఆర్ ఆర్ ఆర్' కు మరో సారి బ్రేక్, ఈసారి రాజమౌళి వంతు

పాపం బాహుబలి తరువాత దర్శకుడు రాజమౌళి చేస్తున్న చిత్రం, అలానే ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి వారసుడు ఎన్ఠీఆర్ లు కలిసి చేస్తున్న సినిమా కావడం తో ప్రేక్షకులు ప్రతిఒక్కరూ కూడా ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.అయితే మూహూర్త బలమో మరేదైనా కారణమో తెలియదు కానీ ఈ చిత్ర షూటింగ్ తోలి నుంచి కూడా బ్రేక్ లతో కొనసాగుతుంది.

 Rajamouli Gave A Break To Rrr Movie-TeluguStop.com

తొలుత ఈ చిత్ర తొలిదశ షూటింగ్ లో చెర్రీ గాయపడడం ఆయన కోలుకున్నాడు అనుకున్నాక మళ్లీ ఎన్ఠీఆర్ గాయపడడం ఇలా కొద్దీ రోజులు ఈ చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది.వారిద్దరూ సెట్ అయ్యారు లే అని అనుకుంటే ఈ చిత్ర హీరోయిన్ ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ గాయం పాలు కావడం తో మరోసారి బ్రేక్ పడింది.

అయితే అంతా పక్కన పెట్టి ఈ చిత్ర షూటింగ్ ను మొత్తానికి మొదలు పెట్టారు అంటూ రెండు రోజుల క్రితం వార్తలు గుప్పుమన్నాయో లేదో మళ్లీ మరోసారి ఈ చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తుంది.అయితే ఈసారి దర్సకుడు రాజమౌళి వంతు వచ్చింది.

ఏదో పర్సనల్ పని మీద జక్కన్న అమెరికా వెళ్లాల్సి ఉండటంతో వారంపాటు చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు.

'ఆర్ ఆర్ ఆర్' కు మరో సారి బ్రేక్

ఇకపోతే దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, చెర్రీ అల్లూరి సీతారామరాజు గా,ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించనున్నారు.మొదటిసారి నందమూరి,మెగా ఫ్యామిలీ కి చెందిన ఈ తరం హీరోలు నటిస్తున్న చిత్రం కావడం తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెరిగిపోయాయి.అందుకే ఎప్పుడు ఎప్పుడు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పెద్ద స్క్రీన్స్ లో దర్శనమిస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube