వైసీపీలో నామినేటెడ్ పోస్టుల సందడి ! ఎవరికి ఏ పదవి అంటే ?

ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అంటూ పాటలు పాడుకుంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఆశావాహులు.ప్రస్తుతం కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతో నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూపులు చూస్తున్నవారికి అధినేత జగన్ తీపి కబురు చెప్పబోతున్నాడు.

 Nominated Postsin Ycpparty-TeluguStop.com

తాజాగా నామినేటెడ్ పదవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో కొందరి పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.వీరిలో పార్టీకి వీర విధేయులుగా ఉన్న కొంతమంది కి ప్రాధాన్యత కల్పించినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే రోజాకి ఏపీ ఐ ఐ సి ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు.అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా వాసి రెడ్డి పద్మను ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక సీఆర్డీయే ఛైర్మన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమించబోతున్నారట.

ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మోహన్‌బాబుకి ఛాన్స్ ఇవ్వబోతున్నారట.

ఇక మొదటి నుంచి తనకు వీర విధేయుడిగా ఉంటూ వైసీపీ ప్రత్యర్థుల మీద విరుచుకుపడే అంబటి రాంబాబుకి తప్పనిసరిగా మంత్రిపదవి వస్తుందని అంతా ఆశించారు.కానీ ఆ పదవి సామజిక సమీకరణాల లెక్కల్లో అతడికి దక్కకపోవడంతో ఆర్టీసీ ఛైర్మన్‌గా అంబటి రాంబాబు పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్యెల్యే గ్రంధి శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ద్రోణంరాజు శ్రీనివాస్‌ పేరు వినిపిస్తోంది.

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా యేసురత్నం.సివిల్ సప్లయిస్ కమిషన్ ఛైర్మన్‌గా ఆమంచి కృష్ణమోహన్.

పేర్లను పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా కొయ్యే మోషేన్ రాజు.

వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా మహ్మద్ ముస్తఫా.ఇతర ఛైర్మన్ల పోస్ట్ లను కూడా సీఎం జగన్ దాదాపు భర్తీ చేసినట్లు తెలుస్తోంది.

వీటితో పాటూ భూమన కరుణాకర రెడ్డిని రాయలసీమ అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా ఖరారు చేయబోతున్నట్టు సమాచారం.ఇప్పటికే ప్రభుత్వ పధకల అమలులో దూకుడుగా ముందుకు వెళ్తున్న జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నాడు.

ఇప్పటికే ఉద్యోగస్తులకు, డ్వాక్రా సంఘాలకు, రైతులకు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల వారికి న్యాయం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు.అలాగే ఇప్పుడు పార్టీలో తనను నమ్ముకుని ఉన్నవారికి సరైన న్యాయం చేసేందుకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి తెరలేపినట్టు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube