శృతి మించుతున్న వైసీపీ కార్యకర్తలు! జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారుగా  

Ruling Party Leaders Were Verbally Abusing The Leader Of Opposition-

ఏపీలో జగన్ మేనియాతో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాద్యతలు తీసుకున్న తర్వాత జగన్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు.

Ruling Party Leaders Were Verbally Abusing The Leader Of Opposition-

ప్రజాకర్షక విధానాలతో పరిపాలనలో తనదైన ముద్ర వేసి ప్రజల నుంచి మద్దతు సొంతం చేసుకొని పదేళ్ళ పాటు అధికారంలో కొనసాగేందుకు ప్రణాళిక వేసుకుంటున్నారు.ఎక్కడా కూడా అవినీతి మారక పడనీయకుండా, పాలనలో పారదర్శకత ఉండే విధంగా తన విధానాలు అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇక మంత్రులకి కూడా అవినీతికి పాల్పడినట్లు ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన తక్షణం పదవి నుంచి తప్పించడం జరుగుతుందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఇలా జగన్ తన పరిపాలనతో ప్రజాభిమానం పొందే ప్రయత్నం చేస్తూ ఉంటే మరో వైపు ఆ పార్టీ క్రింది స్థాయి కార్యకర్తలు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు.

సోషల్ మీడియాలో వైసీపీ మీద ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఎదురుదాడి చేస్తూ బూతులు తిడుతున్నారు.కొంత మంది మరింత శృతి మించి, స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, నేతలతో గొడవలు పడుతూ బెదిరింపులకి పాల్పడుతున్నారు.

గట్టిగా చెప్పాలంటే ఈ ఐదేళ్ళు తమ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఏం చేసిన అడిగేవాళ్ళు ఉండరు అనే విధంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు వీటికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో జగన్ క్రింది స్థాయిలో ఉన్న వైసీపీ క్యాడర్ ని కంట్రోల్ చేయకుండా ఎన్ని చేసిన ప్రయోజనం ఉండదు అనే మాతం రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

.

తాజా వార్తలు

Ruling Party Leaders Were Verbally Abusing The Leader Of Opposition- Related....