87 ఏళ్ల బామ్మ కేరింతలకు కోహ్లీ ఫిదా

అభిమానానికి వయసుతో సంబంధం లేదని ఒక భామ్మ నిరూపించింది.యువతకు ఏ మాత్రం తీసిపోకుండా కేరింతలు కొడుతూ భూర ఊదుతూ తనదైన శైలిలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు.

 Kohli Happy With 87yrs Old Woman Cricket Fan-TeluguStop.com

టీమిండియాకు మద్దతు పలుకుతూ అందరిని ఆకర్షించిన 87 ఏళ్ల ఆ వృద్ధురాలు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఫెమస్ అయ్యారు.

87 ఏళ్ల బామ్మ కేరింతలకు కోహ్లీ

మంగళవారం జరిగిన బాంగ్లాదేశ్ – ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ లో కెమెరాలు చారులత పటేల్ అనే మహిళపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి.మ్యాచ్ ఎండింగ్ వరకు అభిమానులతో పోటీగా జట్టును ఉత్తేజపర్చడంలో తనవంతు పాత్ర పోషించింది.అయితే ఆమెను మ్యాచ్ అనంతరం విరాట్ స్పెషల్ గా కలుసుకున్నాడు.

ఆమె అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వాదం తీసుకొని తరువాతి మ్యాచ్ కి సన్నద్ధమవుతామని తెలిపాడు.రోహిత్ శర్మ కూడా ఆ సీనియర్ అభిమానిని కలుసుకొని కాసేపు ముచ్చటించాడు.ప్లేయర్స్ అంతా తన పిల్లలాంటి వారు అంటూ తాను చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తున్నట్లు చారులత తెలిపారు.1983 వరల్డ్ కప్ భారత్ గెలిచినప్పుడు కూడా తాను గ్రౌండ్ లోనే ఉన్నట్లు ఆమె వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube