విడ్డూరం : అందంపై పిచ్చితో ఆమె ఏం చేసిందో తెలిస్తే ఒల్లు జల్దరిస్తుంది

కొంతమంది ఆడవారికి అందం అంటే మహాపిచ్చి ఉంటుంది.నలుగురిలో తాను అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 Woman 300 Operationsfor Facebeauty 1-TeluguStop.com

అందంగా కనిపించే ఉద్దేశ్యంతో వారు కొన్ని సార్లు హద్దులు దాటిన సందర్బాలు కూడా మనం చూస్తూనే ఉంటాం.కొందరు అమ్మాయిలు మేకప్‌ లేకుండా బయటకు వెళ్లని సందర్బాలు ఉంటాయి.

ఇక కొందరు లేటు వయసులో కూడా అందంగా కనిపించేందుకు చాలా అవస్థలు పడుతూ ఉంటారు.చైనాకు చెందిన ఒక మహిళ మాత్రం అందం కోసం ఏకంగా 300 సార్లు ఆపరేషన్‌ చేయించుకుంది.

ఒక్కటి రెండు ఆపరేషన్లకే మనిషి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.అలాంటిది ఈమె ఏకంగా 300 ఆపరేషన్లు చేయించుకుంది అంటే ఆమెకు అందంపై ఎంత మక్కువో అర్ధం చేసుకోవచ్చు.

కోట్లు ఖర్చు చేసి 300 సార్లు ఆపరేషన్‌ చేయించుకున్నా కూడా ఆమెది సహజంగా వచ్చిన సౌందర్యం కాదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.ఇతరులు ఏమనుకుంటారు అనే విషయాన్ని ఆమె పట్టించుకోలేదు.

తాను అందంగా కనిపించాలనేది ఆమె కోరిక.అందుకోసం ఆమె ప్రాణాలను సైతం లెక్క చేయలేదు.

విడ్డూరం : అందంపై పిచ్చితో ఆమె

చైనాకు చెందిన సుబాకి తన 18వ సంవత్సరం నుండి మోడలింగ్‌ లో రాణించాలనే ఉద్దేశ్యంతో అందంగా కనిపించాలని ఆపరేషన్‌లు చేయించుకుంటూ వచ్చింది.కొన్ని వందల సార్లు ఆమె ఆపరేషన్‌ బెడ్‌ ఎక్కింది.ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ప్రస్తుతం ఆమె వయసు 40 ఏళ్లు.ఆమె త్వరలో మరిన్ని ఆపరేషన్లు కూడా చేయించుకుంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.ప్రస్తుతం చూడగానే బొమ్మలా అనిపిస్తున్న ఈ అమ్మడు మొహంపై ఉన్న చిన్న పాటి మైనస్‌లను సరి చేయించుకునేందుకు ఆపరేషన్‌కు సిద్దం అవుతుంది.50 ఏళ్లు వచ్చే వరకు ఈమె ఆపరేషన్స్‌ చేయించుకుంటూనే ఉంటుందేమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube