ఆ మీడియా అంటే టీడీపీకి మొహంమొత్తిందా ?

తెలుగుదేశం పార్టీకి ఉన్న బల, బలాలను లెక్కలోకి తీసుకుంటే ప్రధానంగా కనిపించేది మీడియా బలం.ప్రస్తుతం ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను పరిగణలోకి తీసుకుంటే టీడీపీకి అనుకూలంగా ఉన్నవే ఎక్కువ.

 Chandrababu Naidu About Social Media Campaign1-TeluguStop.com

తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం బలహీనత ఆ పార్టీ అనుకూల మీడియానే అన్న సంగతి కూడా అందరికి బాగా తెలుసు.కేవలం టీడీపీకి అనుకూలంగా కథనాలు ప్రచారం చేయడం అదే సమయంలో టీడీపీ ప్రత్యర్థి పార్టీల మీద బురద చల్లడం ఇవన్నీ టీడీపీ అనుకూల మీడియాలో సహజంగా జరిగిపోతుంటాయి.

తాజాగా పార్టీ ఓటమిపై సమీక్ష చేసిన చంద్రబాబు కి తమ అనుకూల మీడియా అదే పనిగా చేసిన భజన రివర్స్ అయ్యిందన్న విషయం అర్ధం అయ్యింది.
అనుకూల మీడియాలో నిజమైనా అబద్ధమైనా అసత్యం గానే ప్రజల్లోకి వెళ్లిపోయిందని విషయాన్ని గుర్తించారు.

-Telugu Political News

ఇక టీడీపీ వ్యతిరేక పార్టీలు కూడా అదే పనిగా ఎల్లో మీడియా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ప్రత్యామ్నాయ అవకాశాల కోసం టీడీపీ ఆలోచనలో పడింది.ఈ నేపథ్యంలో సోషల్ మీద మీద కన్నేసింది టీడీపీ.ముందు నుంచి చూస్తే టీడీపీకంటే వైసీపీనే ఎక్కువగా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంది.టీడీపీ మీద నిత్యం అనేక పోస్టింగ్స్ పెడుతూ టీడీపీ పరువు తీస్తూ వైసీపీ సోషల్ మీడియా దూసుకుపోయింది.

ఒకరకంగా వైసీపీ విజయానికి కూడా సోషల్ మీడియా కారణం అయ్యింది.దీంతో ఇప్పుడు టీడీపీ ఆలోచనలో పడింది.ఇకపై వైసీపీ మీద ఎటువంటి ఆరోపణలు చేయాలన్నా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను నమ్ముకునేకంటే సోషల్ మీడియా ను నమ్ముకుంటేనే బెటర్ అన్న ఆలోచనకు వచ్చింది.

-Telugu Political News

ప్రజావేదిక కూల్చివేత, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని హేళన చేస్తూ తెలంగాణ కు అన్నిజగన్ మేలు చేస్తూ ఏపీకి కీడు చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికలపై సెటైర్లుగా వదులుతున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు.ఇక కామెడీ పంచ్ లు, సెలబ్రిటీల బొమ్మలతో పెట్టె పోస్టింగ్స్ కి అయితే లెక్కేలేదు.ఈ తరహా వ్యూహాన్నే వైసిపి ఎన్నికల ముందు అనుసరించింది.

సొంత మీడియా పై ఆధారపడకుండా సోషల్ మీడియా ద్వారా వైసిపి చేసిన ప్రచారం ఆ పార్టీకి చాలా కలిసి వచ్చింది.ఇప్పుడు అదే పంథాను టీడీపీ అనుసరించాలని భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube