రాబోయే నాలుగు నెలల్లో పెళ్లి మాటే వినపడదు.. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి వింత కష్టం

గత కొన్ని నెలలుగా ప్రతి రోజు ఎక్కడ చూసినా ఏదో ఒక శుభకార్యం జరుగుతూనే ఉంది.వేసవి కాలం పూర్తిగా శుభకార్యాలతోనే ముగిసింది.

 Nogood Muhurtham For Marriages Upto Coming 4months 1 1tstop-TeluguStop.com

నిన్నటి వరకు కూడా పెళ్లిల్లు మరియు ఇతర శుభకార్యాలు ఉంటూనే వచ్చాయి.అయితే ఇకపై పెళ్లిలకు ఫుల్‌స్టాప్‌ పడబోతుంది.

మరో నాలుగు నెలల వరకు పెళ్లి మాట అనేది తెలుగు రాష్ట్రాల్లో వినిపించదు.ముస్లీంలు మరియు క్రైస్తవులు చేసుకుంటారేమో కాని ఈ నాలుగు నెలల్లో ఒక్క హిందూ వివాహం కూడా జరుగబోదు.

ఎందుకంటే రాబోయే నాలుగు నెలలు కూడా పెళ్లిలకు మరియు ఇతర శుభకార్యాలకు మంచిది కాదు.

హిందూవులు మంచి ముహూర్తాన్ని చూసి మరీ పెళ్లిలు ఇతర శుభకార్యాలు చేస్తారు.

చిన్న ఓపెనింగ్‌ అయినా, కిరాయి ఇంట్లోకి వెళ్లాలి అన్నా కూడా మంచి రోజు చూసి మరీ వెళ్తు ఉంటారు.అలాంటిది నాలుగు నెలల పాటు సరిగా లేదంటా.

జులై 2 నుండి ఆషాడమాసం ప్రారంభం కాబోతుంది.ఈసారే కాదు ఏ సారి కూడా ఆషాడమాసంలో పెళ్లిలు జరగవు.

ఆషాడం తర్వాత శ్రావణం వస్తుంది.అయితే శ్రావణ మాసంలో పెళ్లిలు జరుగుతాయి.

పెళ్లిలకు శ్రావణం మంచిదే.కాని ఈసారి శ్రావణ మాసంలో మూడాలు ఉన్నాయి.

రాబోయే నాలుగు నెలల్లో పెళ్లి �

శ్రావణ మాసంతో పాటు ఆ తర్వాత రెండు మాసాల్లో కూడా మూడాలు కొనసాగుతున్నాయి.అక్టోబర్‌ వరకు ఈ మూడాలు కొనసాగుతున్నాయి.కార్తీక మాసం వరకు శుభకార్యాల కోసం వేచి చూడాల్సిందే అంటూ అయ్యవార్లు అంటున్నారు.ఈ నాలుగు నెలలు అయ్యవార్లు కూడా పూర్తి ఖాళీగా ఉండబోతున్నారు.చావు కార్యక్రమాలు మినహా వారికి మరేం ఉండబోవడం లేదు.పెళ్లి ఫిక్స్‌ అయ్యి ఏదైనా కారణం వల్ల పెళ్లి వాయిదా పడుతూ వచ్చిన వారికి చుక్కలే.

నాలుగు నెలల వరకు వారు పెళ్లి మాటే ఎత్తవద్దు.పెళ్లి అయినా మరే శుభకార్యం అయినా కూడా నాలుగు నెలలు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube