అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి

ప్రముఖ నటి, దర్శకురాలు మరియు సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు.గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యం కారణంగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు.

 Telugu Director Actress Mahesh Babu-TeluguStop.com

-Movie

1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు.విజయనిర్మల ఏడు సంవత్సరాల వయసులోనే 1950లో మత్య్సరేఖ తమిళ చిత్రం ద్వారా బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు.పదకొండో ఏట ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా కథానాయకిగా నటించారు.

-Movie

సుమారు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె పెళ్లి కానుక సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం కూడా చేసారు.
ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు దక్కించుకున్నారు.1971 లో ‘మీనా’ అనే చిత్రానికి మొదటిసారిగా దర్శకత్వం వహించారు.1971నుంచి 2009 వరకూ మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించారు.సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా నేరము-శిక్ష(2009 ) దర్శకురాలిగా ఆమెఆఖరి సినిమా .

-Movie .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube