తమ్ముడి కోసం రౌడీ స్టార్‌ పైరవీ

విజయ్‌ దేవరకొండ హీరోగా ప్రస్తుతం టాలీవుడ్‌ను దున్నేస్తున్నాడు.క్రేజీ హీరోగా వరుసగా చిత్రాలు చేస్తున్న విజయ్‌ దేవరకొండ అప్పుడే తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండను దించేశాడు.

 Anandh Devarakonda Next Movie In Geetha Arts 2telugustopbanner-TeluguStop.com

మొదటి సినిమాతోనే ఆనంద్‌ దేవరకొండ అందరి దృష్టి ఆకర్షించాడు.ఆనంద్‌ మొదటి సినిమా ‘దొరసాని’ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.

మొదటి సినిమా రాకుండానే ఆనంద్‌ దేవరకొండకు ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు అయితే లభించింది.మొదటి సినిమా ఫలితం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆనంద్‌ దేవరకొండ మొదటి సినిమా విడుదల కాకుండానే రెండవ సినిమాకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి.ఇతడి రెండవ సినిమాను గీతాఆర్ట్స్‌లో చేసే అవకాశం కనిపిస్తుంది.అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఒక చిత్రం రూపొందబోతుంది.కొత్త దర్శకుడు ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు.

విజయ్‌ దేవరకొండ కోసం అనుకున్న ఆ స్క్రిప్ట్‌ను ఆయన బిజీగా ఉండటం వల్ల ఆనంద్‌కు షిప్ట్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

తమ్ముడి కోసం రౌడీ స్టార్‌ పైర

స్క్రిప్ట్‌ బాగుండటంతో పాటు అల్లు అరవింద్‌ బ్యానర్‌లో ఆనంద్‌ రెండవ సినిమా రూపొందబోతున్న నేపథ్యంలో రౌడీ తమ్ముడు మరో రౌడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.బ్యాక్‌ గ్రౌండ్‌ బాగానే ఉన్న ఆనంద్‌కు సక్సెస్‌ దక్కితే అంతకు మించిన అదృష్టం లేదు.దొరసాని సక్సెస్‌ అయి, ఆనంద్‌కు మంచి పేరు వస్తే వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

అన్న స్థాయిలో కాకున్నా ఒక రేంజ్‌లో ఆనంద్‌ కూడా సక్సెస్‌ ఫుల్‌ కెరీర్‌ను కొనసాగించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube